Bellamkonda Srinivas Chatrapathi Remake: ఒక సినిమాని రీమేక్ చెయ్యడం లో ఎలాంటి తప్పు లేదు,ఇది ఎన్టీఆర్ కాలం నుండి ప్రతీ హీరో చేస్తున్నదే. కేవలం తెలుగు లో మాత్రమే కాదు,హిందీ , తమిళం,మలయాళం మరియు కన్నడ బాషలలో కూడా రీమేక్ అనేది సర్వసాధారణం. అయితే కొన్ని సినిమాలను ఎట్టి పరిస్థితి లో ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆ సినిమాలు ఆయన నటీనటులు చేస్తేనే బాగుంటుంది,వాళ్లకి మాత్రం సరిపడే సినిమాలు అవి.
అలాంటి చిత్రాలలో ఒకటి ప్రభాస్ మరియు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ‘ఛత్రపతి’ చిత్రం.అప్పటి వరకు మామూలు హీరోగా ఇండస్ట్రీ లో నెట్టుకొస్తున్న ప్రభాస్ ని స్టార్ హీరో గా నిలిపింది ఈ చిత్రం. ఆయన కెరీర్ ని తీసుకుంటే ఛత్రపతి కి ముందు, ఛత్రపతి కి తర్వాత అని చూడొచ్చు. అలాంటి సినిమాని రీమేక్ చెయ్యాలని ఎవ్వరైనా సాహసం చేస్తారా..?, కానీ మన టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఈ సాహసాన్ని చేసాడు.
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని హీరోగా పెట్టి ఆయన ఛత్రపతి చిత్రాన్ని హిందీ లో రీమేక్ చేసాడు. ఈమధ్యనే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు. రెస్పాన్స్ పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చింది. సుమారుగా మూడేళ్ళ నుండి తీస్తున్న ఈ సినిమా కి బడ్జెట్ తడిసి మోపెడు అయ్యిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.#RRR చిత్రాన్ని హిందీ లో విడుదల చేసిన పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. బెల్లంకొండ సినిమాలను హిందీ లో డబ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చెయ్యగా వాటికి మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఇది చూసే వీవీ వినాయక్ ఛత్రపతి రీమేక్ ని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.
20 లేదా 30 కోట్ల రూపాయిల బడ్జెట్ తో ఈ సినిమాని తీసి ఉంటె వర్కౌట్ అయ్యేదేమో, కానీ ఈ చిత్రానికి ఇప్పటి వరకు ఏకంగా వంద కోట్ల రూపాయిల బడ్జెట్ ఖర్చు అయ్యిందట. ఇదే ఇప్పుడు ఇండీస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.బాలీవుడ్ లో జీరో మార్కెట్ ఉన్న బెల్లంకొండ తో ఇంత బడ్జెట్ పెట్టి సినిమా ఎలా తియ్యాలి అనిపించింది..?, వినాయక్ కి బుర్ర పనిచేస్తుందా అని నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. మరి ఏ నమ్మకం తో వినాయక్ ఇంత ఖర్చు పెట్టాడో, ఆ నమ్మకం ఈ సినిమాని నిలబెడుతుందో లేదో చూడాలి.