https://oktelugu.com/

Tollywood Hero : మహేష్ బాబుతో ఉన్న ఈ కుర్రోడు టాలీవుడ్ హీరో అని తెలుసా?

Tollywood Hero : సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ కుర్రాడు కలిసి ఉన్నాడు. ముద్దుగా ఉన్న ఈయనను చూసి మహేష్ బాబు కొడుకు గౌతమ్ అనుకుంటున్నారు. కానీ ఆయన కుమారుడు కాదు. మరో స్టార్ హీరో పుత్రుడు. ఇప్పుడు ఆయన కూడా స్టార్ గా ఎదిగేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరని అనుకుంటున్నారా? గుర్తు పడితే ఒకే.. లేకపోతే మాత్రం వివరాల కోసం కిందికి వెళ్లండి. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి విలన్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 2, 2023 / 02:30 PM IST
    Follow us on

    Tollywood Hero : సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ కుర్రాడు కలిసి ఉన్నాడు. ముద్దుగా ఉన్న ఈయనను చూసి మహేష్ బాబు కొడుకు గౌతమ్ అనుకుంటున్నారు. కానీ ఆయన కుమారుడు కాదు. మరో స్టార్ హీరో పుత్రుడు. ఇప్పుడు ఆయన కూడా స్టార్ గా ఎదిగేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరని అనుకుంటున్నారా? గుర్తు పడితే ఒకే.. లేకపోతే మాత్రం వివరాల కోసం కిందికి వెళ్లండి.

    Hero Srikanth Son Roshan

    టాలీవుడ్ ఇండస్ట్రీలోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత హీరోగా మారిన వారు ఎందరో ఉన్నారు. వారిలో శ్రీకాంత్ ఒకరు. ‘తాజ్ మహల్’ సినిమాలో విలన్ గా కనిపించిన ఈయన ఆ తరువాత ఫ్యామిలీ హీరోగా ఎదిగారు. లవ్, యాక్షన్ ఎలంటి సినిమా అయిన చేయడానికి రెడీ అయిన శ్రీకాంత్ ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించాడు. అయితే ఈ మధ్య ఆయన సినిమాల్లో కనిపించడం తగ్గించారు. అయితే ఆయన కుమారుడు రంగంలోకి దిగారు.

    శ్రీకాంత్ కుమారుడు రోషన్ ‘నిర్మలా కాన్వెంట్’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ‘పెళ్లి సందడి’తో గుర్తింపు పొందారు. డైరెక్టర్ కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో ఈ సినిమా వచ్చినందున సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. కానీ రోషన్ నటనపై ప్రశంసలు వచ్చాయి. ఆ తరువాత ఈ యంగ్ హీరో మరో సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయనకు సంబందించిన చిన్న నాటి ఫొటో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

    తాను చిన్నగా ఉన్నప్పుడు మహేశ్ బాబుతో కలిసి దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ ను చూసి రోషన్ బాబు త్వరలో సూపర్ స్టార్ అంతటి ఇమేజ్ రావాలని కోరుకుంటున్నట్లు మెసేజ్ పెట్టారు. మరి వీరి దీవెనలు ఫలించాలని మనం కూడా కోరుకుందాం..