![]()
Bathing Video : అమ్మాయిల్లో స్వార్థం పెరుగుతోంది. అవసరం కోసం.. ఆర్థిక సాయం కోసం ఎంతటికైనా తెగిస్తున్నారు. తమ పిల్లలు బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు సైతం లెక్కచేయకుండా పిల్లలను హాస్టల్లలో ఉంచి చదివిస్తున్నారు. కానీ అమ్మాయిలు ఊరికి దూరం ఉన్నాం కాబట్టి అక్కడ ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటున్నారు. కొంతమంది బాయ్‌ఫ్రెండ్స్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. కొంతమంది తమ అవసరాల కోసం చేయకూడని పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని తాను ఉండే హాస్టల్‌లోని మరో విద్యార్థిని స్నానం చేస్తుండగా వీడియో తీసింది. మరి ఆ వీడియోను ఎవరికి పంపించాలనుకుందో గాని, బాధితురాలి అప్రమత్తతతో ముప్పు తప్పింది.
బెంగళూరు స్పోర్ట్స్ స్కూల్‌లో..
బెంగళూర్‌లోని స్పోర్ట్స్ అథారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా గర్ల్స్ హాస్టల్‌లో ఓ విద్యార్థిని తన సహచర విద్యార్థిని స్నానం చేస్తుండగా వీడియో తీసింది. బాత్‌రూంలో రహస్యంగా సెల్‌ఫోన్ పెట్టింది. అయితే దీనిని గమనించిన బాధితురాలు అప్రమత్తమైంది. వెంటనే వీడియో తీసిని విద్యార్థిని దానిని డిలీట్ చేసింది. వీడియో తీయలేదని బుకాయించింది. బాధితురాలు ఫోన్‌లోని రీసైకిల్‌బిన్ చూడగా అందులో వీడియో కనిపించింది. దీంతో వెంటనే బాధితురాలు పోలీసులతోపాటు పాఠశాల అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో సాయ్ అధికారులు విద్యార్థినిని సస్పెండ్ చేశారు.

గతంలో చంఢీగర్ యూనివర్సిటీలో..
గతేడాది చండీగఢ్ యూనివర్సిటీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. వర్సిటీలోని బాలికల హాస్టల్‌లో విద్యార్థినులు స్నానం చేస్తుండగా మరో విద్యార్థిని వీడియోలు తీసి వాటిని ముంబైలోని ప్రియుడికి పంపించింది. విద్యార్థినుల వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో విద్యార్థినులు ఆందోళన చేశారు. ఆ ఘటన జరిగి రెండు వారాలు గడవకముందే అదే తరహాలో మరో ఘటన యూపీలోని కాన్పూర్‌లో వెలుగుచూసింది. ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లోని ఓ హాస్టల్‌లో విద్యార్థినులు స్నానం చేస్తుండగా ఓ వ్యక్తి రహస్యంగా వీడియోలు తీయడం కలకలం రేపింది. తాము స్నానం చేస్తుండగా ఓ వ్యక్తి తన ఫోన్‌లో వీడియో తీశాడంటూ కొందరు విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఆ ఉద్యోగిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు.
అమ్మాయిలు ఎందుకు ఇలా తయారవుతున్నారో అర్థం కావడం లేదు. అందరితో కలిసి ఉంటూనే ఇలా వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది. స్వార్థం కోసం, ఇలా మారుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటివి ఎవరికీ మంచిది కాదని పేర్కొంటున్నారు. స్టోర్స్ అథారిటీ పాఠశాల విద్యార్థిని గమనించి ఉండకపోతే ఆమె వీడియో ఎక్కడి వరకు వెళ్లేదో తెలియదు.