
Jaggery Benefits: ఆయుర్వేదంలో చక్కెర కంటే బెల్లం శ్రేష్ఠమైనదిగా చెబుతారు. బెల్లంతో మనకు చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. నేచురోపతి వారైతే బెల్లం కూడా మంచిది కాదంటారు. కానీ మనం మాత్రం బెల్లంతో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని భావిస్తుంటాం. ఇందులో భాగంగా జుట్టు సమస్యలు ఉన్న వారు బెల్లంతో ఫలితం పొందొచ్చు. బెల్లంలో మనకు పనికొచ్చే పోషకాలు ఉన్నాయని చెబుతుంటారు.
మన పూర్వీకులు బెల్లాన్ని విరివిగా వాడేవారు. పండుగల్లో చక్కెర కంటే బెల్లం ఎక్కువగా వాడుకునే వారు. పిండి వంటల్లో అన్ని బెల్లంతో చేసినవే ఉండేవి. ఈ బెల్లంలో ఉండే పోషకాలు అలాంటివి మరి. బెల్లంలో మెగ్నిషియం, పొటాషియం, మినరల్స్ తో పాటు బీ కాంప్లెక్స్, సి, బి2, ఇ వంటి విటమిన్లు ఉన్నాయి. బెల్లాన్ని నువ్వులతో కలిపి తింటే దగ్గు, జలుబు వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. వేరుశనగ పప్పుతో బెల్లం కలిపి తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
బెల్లంతో అజీర్తి సమస్య పోతుంది. మలబద్ధకం, నెలసరిలో సమస్యలు, రక్తహీనత వంటి వాటిని దూరం చేసుకోవచ్చు. అధిక రక్తపోటు అదుపులో ఉంచుతుంది. శరీరానికి శక్తి అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కడుపులో మంట లేకుండా పోతుంది. ఎసిడిటి సమస్యలకు చెక్ పెడుతుంది. చిన్న బెల్లం ముక్క సోంపుతో కలిపి తింటే చాలు నోటి దుర్వాసన లేకుండా పోతుంది.

జుట్టు రాలే సమస్య ఉంటే బెల్లంతో పాటు మెంతులు కలిపి తింటే చాలు. జుట్టు తెల్లబడకుండా బెల్లం సాయపడుతుంది. ఇలా బెల్లంతో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెల్లం వాడకంతో మనకు చాలా రకాల సమస్యల నుంచి దూరం కావచ్చు. రోజువారీ ఆహారంలో బెల్లం చేర్చుకుంటే మన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.