
Sudigali Sudheer: జబర్దస్త్ సుధీర్ గురించి తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ఈ ప్రోగ్రాంలో ఆయన స్కిట్ వస్తుందంటే సందడిగా మారుతుంది. మరోవైపు రష్మీతో ఆయన నడిపిన లవ్ ట్రాక్ తో యూత్ లో సుధీర్ క్రేజీ హీరోగా మారిపోయాడు. అయితే సుధీర్ ఉన్నట్టుండి జబర్దస్త్ ప్రొగ్రాం నుంచి మాయమైపోయాడు. సినిమాల్లో, ఇతర ఛానెళ్లలో కనిపించాడు. దీంతో ఆయన రెమ్యూనరేషన్ కోసం ఇతర ప్రొగ్రామ్స్ చేస్తున్నాడని కొందరు ప్రచారం చేశారు. కానీ ఆయనను జబర్దస్త్ యాజమాన్యం మల్లెమాల ప్రొడక్షన్స్ తీసేసిందని మరికొందరు అంటున్నారు. కొంతకాలంగా ఈ విషయం మరిచిపోయినా తాజాగా చలాకీ చంటి అనే మరో కమెడియన్ సుధీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుధీర్ వెళ్లిపోవడానికి ఆ రెండు కారణాలే అని పరోక్షంగా చెప్పాడు. ఆ రెండు తప్పులు చేసి ఉండకపోతే సుధీర్ జీవితం బాగుండేదన్నట్లు వ్యాఖ్యానించారు. ఇంతకీ సుధీర్ ఎలాంటి తప్పులు చేయడం వల్ల ఆయన కెరీర్ నాశనమైంది?
చాలా మంది కమెడియన్లకు జబర్దస్త్ ప్రోగ్రాం లైఫ్ ఇచ్చింది. కొంతమంది ఇప్పుడు ప్రముఖ నటులుగా చలామణి అవుతున్న వారు ఒకప్పుడు ఈ కార్యక్రమంలో నటించిన వారే. అయితే అందరూ సక్సెస్ అయ్యారని చెప్పలేం. సినిమాల్లో అవకాశాలు, ఇతర వ్యాపారాలు నిర్వహించడం కోసం చాలా మంది జబర్దస్త్ ప్రోగ్రాంను విడిచిపెట్టారు. మరికొందరు ఇతర చానెళ్లలో నటించడానికి వీడాల్సి వచ్చింది. వీరిలో సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ కోసం ఇతర చానెల్ లోకి వెళ్లారని అన్నారు. కానీ జబర్దస్త్ యాజమాన్యంతో వచ్చిన విభేదాలే కారణమని మరోవైపు ప్రచారం జరిగింది.
జబర్దస్త్ లో ఇప్పటికీ కొనసాగుతున్న చలాకీ చంటీ తాజాగా సుధీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది జబర్దస్త్ ప్రోగ్రాంను వీడి తప్పు చేశారని అన్నారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ చేసిన రెండు తప్పుల వల్ల ఆయన మల్లెమాలకు దూరమయ్యారని అన్నారు. సుధీర్ ఈటీవీ షోలు వదిలేసి ఇతర షోలు చేయడం ద్వారా మల్లెమాల యాజమాన్యానికి కోపం వచ్చిందన్నారు. మరోవైపు తనకు గుర్తింపు నిచ్చిన సంస్థ పట్ల గౌరవంగా ఉండాల్సి ఉందని అన్నారు.

అనివార్య కారణాల వల్ల తాను జబర్దస్త్ నుంచి మూడుసార్లు బయటకు వెళ్లానని, అయినా సహేతుకంగానే ఉన్నానని అన్నారు. బజర్దస్త్ ను వీడినా ఏ చానెళ్లలో ప్రోగ్రామ్స్ చేయలేదన్నారు. అందుకే తిరిగి వచ్చినా అవకాశం ఇచ్చారని తెలిపారు. సంస్థకు మనం ఎలాంటి రిలేషన్ తో ఉన్నామనేది చాలా ముఖ్యమని చలాకీ చంటీ చెప్పుకొచ్చారు. దీనినే ఆయా సంస్థలు పరిగణలోకి తీసుకుంటాయని చెప్పారు.
ఇక సుధీర్ ఓ వైపు ఇతర ప్రోగ్రామ్స్ చేస్తూనే పలు సినిమాల్లో నటించారు. కానీ ఆయనకు సినిమాలు వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. ఆయన నటించి రిలీజైన చివరి సినిమా గాలోడు పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా కూడా రాణించకపోవడంతో సుధీర్ నిరాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చలాకీ చంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.