
India Vs Australia Women: ఒక పనిలో కొంచెం కష్టపడితే చాలు.. వారికి వరుస విజయాలు వెన్నంటే ఉంటాయి. వీరికి అదృష్టం లక్కలాగా పట్టుకుంది అని అంటారు. మరికొందరు ప్రాణం పోయే వరకు పోరాడినా ఆశించిన గెలుపు దక్కదు. వీరికి దురదృష్టం వెన్నంటే ఉందని చెప్పుకుంటారు. ఇప్పుడు మన భారత క్రికెట్ కు దురదృష్టం బాగా పట్టినట్లయిందని క్రీడాలోకం చర్చించుకుంటోంది. మొన్న పురుషుల టీ 20 వరల్డ్ కప్ కోసం టీం వీరోచితంగా పోరాడినా సరైన టైంలోనే కప్ చేజారిపోయింది. దీంతో జట్టు అదృష్టం బాగాలేదని అనుకున్నారు. కానీ ఇప్పుడు అమ్మాయిల టీ 20 వరల్డ్ కప్ కు సేమ్ సీన్ రిపీట్ కావడంతో.. అసలు మన క్రికెట్ కే శాపం తగిలింది అని అనుకుంటున్నారు. తాజాగా మహిళల టీ 20 వరల్డ్ కప్ లో మనవాళ్లు బాగా ఆడారు. కానీ సెమిఫైనల్ వెళుతున్న సమయంలో అదృష్టం కలిసిరాక వెనుదిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో మనకే ఎందుకు ఇలా అవుతుంది? అన్న చర్చ సాగుతోంది.
ఇటీవల జరిగిన టీ 20 వరల్డ్ కప్ కోసం అమ్మాయిలు వీరోచితంగా పోరాడారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో విన్నయితే సెమిఫైనల్ కు వెళ్లే అవకాశాలుండేవి. ఈ ఉత్సాహంతో ఫిబ్రవరి 23న జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా విధించిన 173 లక్ష్యాన్ని ఛేదించేందుకు జట్టు రంగంలోకి దిగింది. అయితే 28 పరుగులకే 3 వికెట్లుు పోయాయి. అయినా ఏమాత్రం జడవకుండా జెమీమా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతంగా ఆడారు. అయితే జెమీమా వికెట్ కోల్పోవడంతో కెప్టెన్ హర్మన్ ప్రీత్ బాధ్యత తనపై వేసుకున్నారు. తనకు ఆరోగ్యం సరిగా లేనప్పటికీ చివరి వరకు పోరాడారు. కానీ 7 పరుగులతో గెలుస్తాం అని అనుకునే సమయంలో రనౌట్ అయ్యారు.
హర్మన్ ప్రీత్ కౌర్ 15 ఓవర్లలో రెండు ఫోర్లు కోట్టారు. 32 బంతుల్లో 50 పరుగులు చేశారు. ఈ ఉత్సాహంతో డీప్ మిడ్ వికెట్ మీదుగా షాట్ కొట్టారు. ఈ క్రమంలో ఆమె రెండు రౌన్స్ తీయాలనే ఉద్దేశంతో ముందుకెళ్లారు. కానీ అలా డిసైడ్ కావడం కొంపముంచింది. దగ్గరికి వచ్చే క్రమంలో రనౌట్ అయ్యారు. బ్యాట్ తనకంటే ముందే క్రీజ్ లోకి పెట్టినా తన పాదాలు అందులో మోపకపోవడంతో రనౌట్ డిక్లేర్ చేశారు. ఇది అస్సలు ఊహించని ప్రీత్ తాను రన్ ఔట్ కావడంతో తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ సీన్ చూడగానే క్రీడాభిమానులకు గతం గుర్తుకు వచ్చింది. 2019 టీ 20 వరల్డ్ కప్ లోనూ ధోనీ ఇలాగే రన్ ఔట్ కావడంతో రెండోసారి వచ్చే కప్ చేజారి పోయింది. ఆ సమయంలో భారత్ 10 బంతుల్లో 25 పరుగులు చేయాలి. కానీ అవసరమై టైంలో గప్టిల్ వేసిన త్రో వల్ల ధోనీ రనౌట్ అయ్యాడు. దీంతో కప్ మొత్తం చేజారిపోయింది. ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే ఇద్దరు కెప్టెన్లు కావడంతోనే ఒత్తిడిలో ఇలా చేశారని క్రీడాకారులు చర్చించుకుంటున్నారు.