
Soundarya: సౌందర్య మరణం అభిమానులను ఏళ్ళ తరబడి వెంటాడిన చేదు జ్ఞాపకం. కన్నడ అమ్మాయి అయిన సౌందర్య టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగారు. కన్నడ, మలయాళ, హిందీ, తమిళ భాషల్లో చిత్రాలు చేశారు. సౌందర్యను మనవాళ్ళు తెలుగు అమ్మాయి అనుకునేవారు.ఆమెను చూస్తే పక్కింటి అమ్మాయి, మన ఇంట్లో సభ్యురాలు అనే భావన కలుగుతుంది. అత్యంత సహజంగా నటించే సౌందర్య ఈ తరం సావిత్రిగా పేరుగాంచారు. అనూహ్యంగా 27 ఏళ్ల వయసులో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
అయితే సౌందర్య మరణం గురించి తండ్రికి ముందే తెలుసన్న వార్త షాక్ కి గురి చేస్తుంది. ఈ మేరకు ఓ విస్తుగొలిపే నిజం వెలుగులోకి వచ్చింది. సౌందర్య బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఆమె తండ్రి పేరు కే ఎస్ సత్యనారాయణ. ఈయన పరిశ్రమకు చెందిన వారే. రచయితగా, నిర్మాతగా వ్యవహరించారు. కూతురు సౌందర్యను ఆయన డాక్టర్ చేయాలనుకున్నాడు. సౌందర్య ఎంబిబిఎస్ లో చేరింది కూడాను. హీరోయిన్ ఆఫర్స్ రావడంతో చదువు మధ్యలో వదిలేసింది.
తన ప్రతిభతో అనతికాలంలో ఎదిగి స్టార్ అయ్యింది. దాంతో ఎంబిబిఎస్ పూర్తి చేయలేదు. యాక్టింగ్ ని కెరీర్ గా ఎంచుకుని ఊహించని స్థాయికి వెళ్లారు. సౌందర్య తండ్రి సత్యనారాయణకు జాతకాలు చూడటం వచ్చట. తన కూతురు సౌందర్య జాతకాన్ని చూసి చావును ముందే ఊహించాడట. ఓ దర్శకుడితో… మా అమ్మాయి 2004 వరకు టాప్ స్టార్ గా వెలిగిపోతుంది. తర్వాత ఆమెకు గ్యాప్ వస్తుంది. జాతకరీత్యా జరిగేది ఇదే అన్నాడట.

ఆయన మాటలకు సదరు డైరెక్టర్… బహుశా ఆమె వివాహం చేసుకుంటారేమో, లేదా కెరీర్ నెమ్మదించి ఆఫర్స్ రాకపోవడం వలన గ్యాప్ వస్తుందేమో అనుకున్నాడట. ఆ రోజు ఆయన చెప్పింది సౌందర్య మరణం గురించి అని తర్వాత అర్థమైందట. సౌందర్య బీజేపీ పార్టీలో చేరారు. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగుళూరు నుండి కరీంనగర్ కి ఫ్లయిట్ లో ఆమె బయలుదేరారు. టేకాఫ్ అయిన కాసేపటికే ప్రమాదానికి గురైంది. 2004 ఏప్రిల్ 17న సౌందర్య, ఆమె తమ్ముడు కన్నుమూశారు.