
Upasana Baby Bump: మెగా కోడలు ఉపాసన కొణిదెల మరో మూడు నెలల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం ఉపాసనకు ఏడో నెల అని సమాచారం. గత ఏడాది డిసెంబర్ నెలలో ఉపాసన తల్లి అయ్యారన్న విషయం తెలిసింది. చిరంజీవి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఉపాసన బేబీ బంప్ కనిపించడం లేదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఉపాసన దానికి సంబంధించిన విషయాలు స్వయంగా వెల్లడించారు.
ఉపాసన బేబీ బంప్ బయటకు కనిపించకపోవడానికి ఆమె ధరించే బట్టలు ఒక కారణమట. శరీర తత్వానికి తగ్గట్లు ఉపాసన దుస్తులు ఎంచుకుంటారట. ఆమె బేబీ బంప్ ఇతరుల మాదిరి రివీల్ కాకపోవడానికి ఇదొక రీజన్. మరొక కారణం ఉపాసన పాటిస్తున్న ఆహార నియమాలట. సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు బరువు పెరుగుతారు. ఐదు నుండి పది కేజీల బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.
అలా బరువు పెరగకుండా ఉపాసన ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతున్నారట. కఠిన నియమాలు పాటిస్తున్నారట. అలా అని తినకుండా కడుపు మాడ్చుకోవడం లేదట. తనతో పాటు బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు పోషక ఆహారం మాత్రమే తింటున్నారట. ఈ కారణాలతో ఉపాసన బేబీ బంప్ సాధారణం కంటే తక్కువగా కనిపిస్తుందని ఆమె పరోక్షంగా వెల్లడించారు.

ఇటీవల ఉపాసన దంపతులు విదేశాల్లో విహరించి వచ్చారు. దుబాయ్ తో పాటు మాల్దీవ్స్ లో ఉపాసన-రామ్ చరణ్ తమ ట్రిప్ ఎంజాయ్ చేశారు. దుబాయ్ లో ఉపాసన సీమంతం జరగడం విశేషం. ఈ వేడుకలో ఉపాసన కుటుంబ సభ్యులు కొందరు పాల్గొన్నారు. ఇక కడుపులో బిడ్డతో విహరించడం గొప్ప అనుభూతి అని ఉపాసన చెప్పడం విశేషం. ఉపాసన దంపతులు 10 ఏళ్ల తర్వాత పేరెంట్స్ అయ్యారు. 2021లో ఉపాసన-రామ్ చరణ్ ల వివాహం జరిగింది.
పదేళ్ల వరకు పిల్లలు వద్దని రామ్ చరణ్-ఉపాసన ఓ ఒప్పందం చేసుకున్నారట. కుటుంబ సభ్యులు, సమాజం నుండి ఎంత ఒత్తిడి ఎదురైనా అనుకున్న ప్రకారం మేము పిల్లలను కనలేదని ఉపాసన ఇటీవల వెల్లడించారు. ఇప్పుడు అన్ని విధాలా మేము సిద్ధం, అంటూ ఉపాసన చెప్పుకొచ్చారు.