
Rudrudu Collections: కాంచన సిరీస్ తర్వాత రాఘవ లారెన్స్ తెలుగు లో మన ముందుకి ‘రుద్రుడు’ గా ఇటీవలే వచ్చిన సంగతి తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ చిత్రం తో పాటుగా విడుదలైన ఈ సినిమా కి నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ లారెన్స్ కి ఉన్న మాస్ ఇమేజి వల్ల మంచి ఓపెనింగ్ దక్కింది. ప్రొమోషన్స్ కాస్త బాగా చేసి ఉంటే ఈ సినిమాకి కచ్చితంగా మరింత మెరుగైన వసూళ్లు వచ్చేవని ట్రేడ్ పండితుల అభిప్రాయం.
ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 7 కోట్ల రూపాయలకు పైగానే జరిగింది.ఇది కేవలం లారెన్స్ మాస్ ఇమేజి వల్ల జరిగిన బిజినెస్ అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా ఇప్పుడు లాంగ్ రన్ లో ఇంత మొత్తం వసూళ్లను రాబట్టడం అసాధ్యం అని అంటున్నారు ట్రేడ్ పండితులు. కారణం మొదటి మూడు రోజులకు కలిపి ఈ సినిమా కేవలం కోటి 80 లక్షల రూపాయిలు మాత్రమే వసూళ్లు చేసింది.
ఇక సోమవారం రోజు ఈ సినిమాకి అన్నీ ప్రాంతాలలో వసూళ్లు బాగా తగ్గిపోయాయి. కొన్ని ప్రాంతాలలో అయితే గ్రాస్ రావడమే గగనం అయిపోయింది. ట్రేడ్ వర్గాల లెక్క ప్రకారం ఈ సినిమా నాల్గవ రోజు కేవలం 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లే వచ్చాయట. అలా నాలుగు రోజులకు కలిపి ఈ సినిమా రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే సాధించిందని, వచ్చే వారం ‘విరూపాక్ష’, ఆపై వచ్చే వారం ‘ఏజెంట్’ వంటి భారీ సినిమాలు ఉండడం తో ఇక్కడితో ఈ సినిమా రన్ పూర్తి అయ్యినట్టే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఫుల్ రన్ లో మరో 50 లక్షల షేర్ కూడా వస్తుందో లేదో అనుమానం గా ఉందని, కచ్చితంగా బ్రేక్ ఈవెన్ ఛాన్స్ అయితే లేదని అంటున్నారు.అంటే బయ్యర్స్ కి సాలిడ్ గా 5 కోట్ల రూపాయిల నష్టం అన్నమాట.ట్రేడ్ వర్గాల లెక్క ప్రకారం ఇది డిజాస్టర్ అనే చెప్పాలి.