Barrelakka: బర్రెలక్క కోసం ఆమె తండ్రికి డబ్బిచ్చారా? అసలేంటి మ్యాటర్?

రీసెంట్ గా ఆమె తండ్రి ఆమె గురించి నెగిటివ్ గా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.అయితే మా నాన్న గురించి నేను ఎక్కడా చెప్పలేదని ఆయన గురించి తప్పు పడితే మా కుటుంబాన్ని మేము తప్పు పట్టినట్టే అని కామెంట్లు చేసింది శిరీష. అంతేకాదు ఆమె తండ్రి మెంటల్ కండిషన్ దెబ్బతిన్నదని తెలిపింది.

Written By: Swathi Chilukuri, Updated On : February 2, 2024 12:47 pm
Follow us on

Barrelakka: శిరీష అనే పేరు కంటే బర్రె లక్క గా ఎక్కువ పాపులర్ అయింది శిరీష. కరోనా సమయంలో ఉద్యోగాలు లేవు, అందుకే బర్రెలు కాస్తున్న అనే విధంగా ఒక చిన్న వీడియో చేసి సోషల్ మీడియాలో పంచుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెను బర్రెలక్క అంటారు. అయితే ఈమె రీసెంట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఫలితాలు ఎలా ఉన్నా ఆమె ధైర్యాన్ని చాలా మంది కొనియాడారు. ఏకంగా ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సత్తా చాటుకుంది. ఓటమి పాలైన కూడా వెనకడుగు వేయకుండా మళ్లీ పోటీకి నిలబడడానికి సిద్దమవుతోంది.

అయితే రీసెంట్ గా ఆమె తండ్రి ఆమె గురించి నెగిటివ్ గా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.అయితే మా నాన్న గురించి నేను ఎక్కడా చెప్పలేదని ఆయన గురించి తప్పు పడితే మా కుటుంబాన్ని మేము తప్పు పట్టినట్టే అని కామెంట్లు చేసింది శిరీష. అంతేకాదు ఆమె తండ్రి మెంటల్ కండిషన్ దెబ్బతిన్నదని తెలిపింది. అయితే ఈమె ప్రశ్నించడం వల్లే తండ్రి నెగిటివ్ గా కామెంట్లు చేశారని.. తన తల్లిని తండ్రి కొడితే వెన్నెముకలో క్రాక్ వచ్చిందని బాధ పడింది శిరీష. అంతేకాదు డబ్బు, బంగారం తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని కూడా తెలిపింది.

తండ్రి ఎలా ఉన్నా కూడా ఇంట్లోనే ఉండాలని ఇంటికి తీసుకొని వచ్చినా కూడా మళ్లీ ఇంట్లో నుంచి వెళ్లిపోయారట. ఇక వారి గురించి సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై స్పందిస్తూ తన ఇంట్లో జరిగేది యూట్యూబ్ ఛానల్ వారికి ఎలా తెలుస్తోంది? అంటూ ప్రశ్నించింది. అయితే తన నాన్నతో ఎవరో కావాలనే చెప్పించారని.. తన గురించి చెడుగా చెప్పడానికి ఒక లక్ష రూపాయలు తండ్రికి ఇచ్చారని పేర్కొంది. అంతేకాదు తన తండ్రితో మాట్లాడి మూడున్నర సంవత్సరాలు అవుతుందంటూ బాధ పడింది.

అయితే తన తండ్రి శ్రీశైలంలో బిక్షం అడుక్కున్నారని.. కానీ తను మాత్రం చిన్న ఛానెల్ కు సైతం ఇంటర్వ్యూ ఇచ్చాను అని తెలిపింది. ఇక్కడే ఎవరు ఎలాంటి వారు ఏంటి అని అర్థం చేసుకోవాలని.. ఒక్కసారి తప్పుగా ప్రచారం చేసే ముందు వీటి గురించి ఆలోచించండి అంటూ కామెంట్లు చేసింది. ఇక 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనుండగా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.