Sanjay Leela Bhansali: బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్..దీని ఫస్ట్ లుక్ గ్లింప్స్ గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. సోనాక్షి సిన్హా, అదితిరావ్ హైదరీ, మనీషా కొయిరాలా, రిచా చద్దా వంటి టాప్ కథనాయకలు నటించిన ఈ సిరీస్ ఫస్ట్ లుక్ హైలెట్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు.
సంజయ్ లీలా భన్సాలీ స్వభావంపై పలు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా భన్సాలీ స్వభావం పై వస్తున్న వార్తలను నటి సీమా పహ్వా ఖండించారు. ‘గంగూబాయి కతియావాడి’ లో సంజయ్ లీలా భన్సాలీతో కలిసి సీమా పహ్వా పని చేశారు. ఆయనకు కోపం ఎక్కువ , షూటింగ్ సమయాల్లో అరుస్తుంటారని పలు వార్తలు తాను విన్నానని చెప్పారు. అయితే భన్సాలీ మాత్రం ఏదైనా షూటింగ్ లో చాలా ప్రశాంతంగా, ప్రొఫెషనల్ గా ఉండేవారని తెలిపారు.
సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ వంటి నటులు సైతం సంజయ్ భన్సాలీపై ఆరోపణలు చేశారని తెలుస్తోంది. అయితే సీమా పహ్వా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సంజయ్ తో కలిసి తాను ఇది వరకు ఎప్పుడూ పని చేయలేదని, ఒక్కసారే తనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందన్నారు. తనతో పని చేసేటప్పుడు నటీనటులు ఎలా ఫీల్ అవుతారనే విషయం తనకు తెలియదని చెప్పారు. అలాగే ఇదివరకు కామెడీ పాత్రలో కనిపించిన తనను నెగిటివ్ రోల్ లో చూసి ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారనేది సవాల్ గా మారిందన్నారు. నటుల నుంచి సంజయ్ ఆశించే పర్ఫెక్షన్ రాకపోతే ఆయన కోపం తెచ్చుకుంటారని, అరుస్తారని విన్నాను కానీ షూటింగ్ సమయాల్లో ఆయనను అలా ఎప్పుడూ చూడలేదని వెల్లడించారు.
అలాగే ‘గంగూబాయి కతియావాడి’ లో టైటిల్ రోల్ పోషించిన అలియా భట్ గురించి కూడా పహ్వా మాట్లాడారు. ఆలియా చాలా కష్టపడి పని చేస్తారని, అలాగే పెద్దలను, సీనియర్ నటీనటులను ఎంతగానో గౌరవిస్తారని తెలిపారు. ఎవరైనా తనతో నటించే సమయంలో చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతారని తెలిపారు.