
Ram Charan- Upasana: గ్లోబల్ స్టార్ రామ్ చార వైఫ్ ఉపాసన కొణిదెల లేటెస్ట్ ఇంటర్వ్యూలో తమ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. పిల్లల్ని కనే విషయమై ఈ స్టార్ కపుల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా ఆ గుడ్ న్యూస్ చెప్పలేదు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా అత్యంత భారీ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోగా రామ్ చరణ్ నుండి సంతానం అభిమానులు కోరుకుంటారు. మెగా వారసత్వాన్ని ఆయన పిల్లలు ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తారు. దీంతో రామ్ చరణ్-ఉపాసన ఒకింత ఒత్తిడి ఎదుర్కొన్నారు.
అయితే పిల్లల్ని ఎప్పుడు కనాలో తమకు స్పష్టమైన ప్రణాళిక ఉన్నట్లు ఉపాసన చెప్పారు. వివాహమైన తర్వాత పదేళ్ల వరకు పిల్లలు వద్దని రామ్ చరణ్ నేను అనుకున్నాము. సమాజం, ఫ్యామిలీ మెంబర్స్ ఒత్తిడి తలొగ్గకుండా మేము పిల్లల్ని కనాలనుకున్నప్పుడు మాత్రమే కంటున్నందుకు సంతోషంగా ఉంది. మేమిద్దరం మా రంగాల్లో ఎదిగాము. ఆర్థికంగా బలోపేతం అయ్యాము. మా పిల్లలు అడిగింది ఇవ్వగలిగిన స్థాయిలో ఉన్నాము… అని ఉపాసన చెప్పుకొచ్చింది.
ఇది మా ఇద్దరి మధ్య ఉన్న బలమైన బంధానికి, అవగాహనను తెలియజేస్తుందని ఉపాసన అన్నారు. ఇక రామ్ చరణ్ తో వివాహమైనప్ప్పటి నుండి నేను విమర్శలు ఎదుర్కున్నానని ఉపాసన అన్నారు. నేను అందంగా లేదని, లావుగా ఉన్నానని, రామ్ చరణ్ డబ్బుల కోసమే నన్ను వివాహం చేసుకున్నాడంటూ దారుణమైన కామెంట్స్ చేశారు. నేను బాడీ షేమింగ్ కి గురయ్యాను. నన్ను విమర్శించిన వాళ్ళను నేను ఏమీ అనను. ఎందుకంటే వాళ్లకు నా గురించి తెలియదు.

ఈ పదేళ్లలో నేనేమిటో వాళ్లకు పూర్తిగా తెలిసి వచ్చింది. ఇప్పుడు గౌరవించడం మొదలుపెట్టారు. నేను ఒక ఛాంపియన్ గా ఫీల్ అవుతాను. ఆ విమర్శలు అన్నీ ఎదుర్కొని నిలబడ్డాను. సోషల్ మీడియా ట్రోలింగ్ ని ఎలా ఫేస్ చేయాలో ఇప్పుడు నాకు తెలుసు. నేను మరింత ధైర్యవంతురాలిని అయ్యాను అని ఉపాసన అన్నారు. 2012లో రామ్ చరణ్ ఉపాసన వివాహం చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 12న ఉపాసన తల్లైన విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రస్తుతం ఉపాసన గర్భవతి కాగా కొన్నినెలల్లో ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు.