
Mirchi Movie: ప్రభాస్ కెరీర్ ని ఊహించని మలుపు తిప్పిన సినిమాలలో ఒకటి ‘మిర్చి’..టాలీవుడ్ లో నేడు స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలుగుతున్న కొరటాల శివ ఈ సినిమా ద్వారానే దర్శకుడిగా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు, అప్పటిలో వరకు బోయపాటి శ్రీను మరియు వంశి పైడిపల్లి వంటి దర్శకులకు రచయితగా పని చేసిన కొరటాల శివ, మిర్చి తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.ప్రభాస్ కెరీర్ లో ఊర మాస్ కమర్షియల్ సినిమా ఇదే.
బాహుబలి చేసే ముందు ప్రభాస్ తన అప్పులను తీర్చుకోడానికి తన స్నేహితులతో కలిసి చేసిన సినిమా ఇది.రెమ్యూనరేషన్ తో పాటుగా లాభాల్లో వాటాలు కూడా ప్రభాస్ కి బాగానే వచ్చింది.ఫిబ్రవరి నెల సినిమాలకు సీజన్ కాదని అంటూ ఉంటారు ట్రేడ్ పండితులు, అలాంటి ఫిబ్రవరి నెలలోనే ఈ సినిమా విడుదలై ఆరోజుల్లోనే దాదాపుగా 50 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను రాబట్టింది.
అయితే ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై తెగ వైరల్ గా మారాయి.అదేమిటంటే ఈ సినిమాని మొదట సూపర్ స్టార్ మహేష్ బాబు తో తియ్యాలనుకున్నాడట కొరటాల శివ, మహేష్ ని కలిసి ఈ కథ చెప్పడానికి చాలా ప్రయత్నాలే చేసాడట, కానీ ఎందుకో కుదర్లేదు.ఆ తర్వాత ఒక రోజు వంశీ కి ఈ సినిమా సినిమా స్టోరీ లైన్ చెప్పగా వెంటనే కొరటాల ని ప్రభాస్ వద్ద కి తీసుకెళ్లి మొత్తం స్క్రిప్ట్ ని వినిపించాడట, ప్రభాస్ కి కొరటాల శివ లోని న్యారేషన్ స్కిల్స్ బాగా నచ్చాయి.

కథలో కూడా దమ్ము ఉండడం తో వెంటనే ఈ ప్రాజెక్ట్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట ప్రభాస్.అయితే ఈ సినిమా మహేష్ కి సూట్ అవుతుందో లేదో తెలీదు కానీ, ప్రభాస్ కటౌట్ సరిగ్గా సెట్ అయ్యింది..ఆయన కాకుండా ఈ సినిమాని ఎవ్వరు చెయ్యలేరు అనే రేంజ్ లో నటించాడు ప్రభాస్.
Also Read:Leo Movie Ram Charan: విజయ్ లియో మూవీలో రామ్ చరణ్… లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో మెగా హీరో?