
Chandramohan: హీరో గా క్యారక్టర్ ఆర్టిస్టుగా ఒక రేంజ్ లో సక్సెస్ లను చూసి లెజండరీ స్థానాన్ని సంపాదించుకున్న అతి తక్కువ మందిలో ఒకడు చంద్రమోహన్.సుమారు 800 సినిమాల్లో నటించిన ఈయన 2017 వ సంవత్సరం వరకు బిజీ ఆర్టిస్టుగానే కొనసాగుతూ వచ్చాడు.ఆ తర్వాత ఆరోగ్య రీత్యా ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ, తన కుటుంబం తో ప్రశాంతం గా బ్రతుకుతూ తన శేష జీవితాన్ని గడిపేస్తున్నాడు.
ఆరోజుల్లో ఈయన ఎన్టీఆర్ , ఏఎన్నార్, కృష్ణ మరియు శోభన్ బాబు తర్వాత పెద్ద స్టార్ హీరో గా ఒక వెలుగు వెలిగాడు.అప్పట్లో ఈయన సినిమా ద్వారా పరిచయమైనా ప్రతీ హీరోయిన్ పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ సాధించి నెంబర్ 1 స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగారు.వారిలో శ్రీదేవి, జయప్రద వంటి వారు ఉన్నారు.ఇక హీరోలలో ఈయనకి శోభన్ బాబు ఎంతో మంచి స్నేహితుడు.ఆయన ఇచ్చిన కొన్ని సలహాల వల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటూ చంద్ర మోహన్ అనేక సందర్భాలలో తెలిపాడు.
శోభన్ బాబు ఆరోజుల్లో తనకి వచ్చిన రెమ్యూనరేషన్ లో సగం ప్లాట్స్ ని కొనుగోలు చెయ్యడానికే ఉపయోగించేవాడనే విషయం అందరికీ తెలిసిందే.ఆయన మిత్రులు మరియు సన్నిహితులకు కూడా ఇది బాగా అలవాటు చేయించాడు.ఫలితంగా శోభన్ బాబు తో పాటుగా , ఆయన ఐడియా ని ఫాలో అయినా వాళ్ళందరూ ఇప్పుడు వందల కోట్ల ఆస్తులకు అధిపతులు అయ్యారు.వారిలో చంద్ర మోహన్ కూడా ఒకడు, ఈయన కూడా శోభన్ బాబు ఆరోజుల్లో ఇచ్చిన సలహాని ఆచరించి తనకి వచ్చే రెమ్యూనరేషన్ లో కొంత భాగాన్ని పక్కన పెట్టి భూములను కొనుగోలు చేసాడట.

వాటి విలువ ఇప్పుడు పెరిగి పెద్దదై 350 కోట్ల రూపాయిలు అయ్యిందట.చంద్ర మోహన్ కి ప్రస్తుతం ఉన్న ఆస్తుల విలువ అంత అన్నమాట.ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.ఆయన చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా బాగా వైరల్ అయ్యాయి.
