
Sir Movie Box Office Collection: తమిళ స్టార్ హీరో ధనుష్ మొట్టమొదటి తెలుగు సినిమా ‘సార్’ నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు తమిళ బాషలలో విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే. ధనుష్ మొట్టమొదటి తెలుగు సినిమా కావడం తో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మొదటి నుండి అంచనాలు భారీగానే ఉండేవి. దానికి తగ్గట్టుగానే టీజర్ మరియు ట్రైలర్ సినిమా పై మరింత అంచనాలు పెంచాయి. క్రేజ్ ని సరిగ్గా క్యాష్ చేసుకోడం లో దిట్ట అయిన సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా ప్రీమియర్ షోస్ ని ఏర్పాటు చేసాడు.ఈ షోస్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఏ టాలీవుడ్ హీరో కి కూడా రానటువంటి రెస్పాన్స్ ధనుష్ కి రావడం చూసి ట్రేడ్ పండితులు ఆశ్చర్యపోయారు. ప్రీమియర్ షోస్ నుండి పాజిటివ్ టాక్ రావడం తో మొదటిరోజు రెగ్యులర్ షోస్ కి బాగా కలిసిచింది.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసిన హౌస్ ఫుల్స్ బోర్డ్స్ తో థియేటర్స్ కళకళలాడిపోయాయి.. ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 6 కోట్ల రూపాయిల వరకు జరిగింది. మొదటి రోజు వచ్చిన అద్భుతమైన ఓపెనింగ్స్ చూస్తూ ఉంటే కేవలం తెలుగు స్టేట్స్ లో రెండు కోట్ల రూపాయిల షేర్ ని చాలా అవలీల గా రాబట్టిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఇది కాకుండా అదనంగా ప్రీమియర్ షోస్ నుండి వచ్చిన 50 లక్షల రూపాయిలను కూడా కలిపితే ఈ సినిమా మొదటి రోజే దాదాపుగా 50 శాతం రికవరీ అయ్యినట్టు తెలుస్తుంది.

రెండవ రోజు కానీ, లేదా మూడవ రోజు కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని అంచనా వేస్తున్నారు.. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.