ఈ మధ్య కాలంలో దేశంలో చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. చిన్నచిన్న కారణాలకే కోపం తెచ్చుకుని కొందరు అవతలి వ్యక్తుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చపాతీలు చల్లగా ఉండటంతో కస్టమర్స్ యజమానిని తుపాకీతో కాల్చి హత్య చేశాడు. గురువారం రోజు చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read: భారతదేశంలో డ్రైవర్ లేని ట్రైన్.. ఎక్కడ రాబోతుందంటే..?
పూర్తి వివరాల్లోకి వెళితే కసుస్తాబ్ సింగ్, అమిత్ చౌహాన్ అనే ఇద్దరు స్నేహితులు రాత్రి 11.30 గంటల సమయంలో ఒక డాబాకు వెళ్లారు. డాబా ఓనర్ డాబాను మూసివేస్తున్న సమయంలో వారిద్దరూ డాబా దగ్గరకు వెళ్లారు. కసుస్తాబ్ సింగ్, అమిత్ చౌహాన్ డాబాలో ఏమున్నాయని అడగగా డాబా యజమాని చపాతీలు మాత్రమే ఉన్నాయని సమాధానం ఇచ్చాడు. ఆ తరువాత ఇద్దరు స్నేహితులు చపాతీలను ఆర్డర్ చేశారు.
Also Read: గొప్ప మనస్సు చాటుకున్న భిక్షగాడు.. 600 మంది అనాథల కోసం..?
అయితే డాబా యజమాని ఇచ్చిన చపాతీలు చల్లగా ఉండటంతో కసుస్తాబ్ సింగ్, అమిత్ చౌహాన్ డాబా యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకే చల్లని చపాతీలు ఇస్తావా అంటూ గొడవకు దిగారు. ఆ తరువాత కస్తుస్తాబ్ సింగ్ తన జేబులో ఉన్న తుపాకీతో డాబా యజమానిపై కాల్పులు జరిపాడు. ఆ బుల్లెట్ తొడలోకి వెళ్లడంతో డాబా యజమాని గట్టిగా కేకలు పెట్టాడు. ఆ కేకలకు స్థానికులు డాబా దగ్గరికి చేరుకున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
డాబా యజమానిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు తొడలోకి లోతుగా దిగిన బుల్లెట్ ను తొలగించి డాబా యజమానిని రక్షించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని కాల్పులు జరిపిన వ్యక్తిని , కాల్పులకు సహకరించిన అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. చపాతీల కోసం కాల్పులు జరిపిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.