భారతదేశంలో డ్రైవర్ లేని ట్రైన్.. ఎక్కడ రాబోతుందంటే..?

దేశంలో శాస్త్రవేత్తల కృషి ఫలితంగా టెక్నాలజీ వల్ల ప్రజలకు ఎన్నో కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. త్వరలో ప్రజలకు డ్రైవర్ లేని ట్రైన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. అతి త్వరలో ఢిల్లీలోని మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులు ఈ సర్వీసులను వినియోగించుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నెల 28వ తేదీన ఈ ట్రైన్ ప్రారంభం కానుండగా ఈ ట్రైన్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం. Also Read: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. జనవరి నెలలో […]

Written By: Kusuma Aggunna, Updated On : December 26, 2020 11:58 am
Follow us on


దేశంలో శాస్త్రవేత్తల కృషి ఫలితంగా టెక్నాలజీ వల్ల ప్రజలకు ఎన్నో కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. త్వరలో ప్రజలకు డ్రైవర్ లేని ట్రైన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. అతి త్వరలో ఢిల్లీలోని మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులు ఈ సర్వీసులను వినియోగించుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నెల 28వ తేదీన ఈ ట్రైన్ ప్రారంభం కానుండగా ఈ ట్రైన్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం.

Also Read: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. జనవరి నెలలో బ్యాంకు సెలవులివే..?

ఢిల్లీ నుంచి మెజెంటా వెళ్లే ప్రయాణికులు ఈ రైలు ద్వారా ప్రయాణం చేయవచ్చు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇలాంటి ట్రైన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డ్రైవర్ లేని ట్రైన్లు అందుబాటులోకి వస్తే రైల్వే శాఖకు సైతం లాభాలు మరింతగా పెరగడంతో పాటు ప్రయాణికులు ఇలాంటి ట్రైన్లలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు ఎక్కువగా ఆసక్తి చూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దేశంలో డ్రైవర్ లేకుండా నడుస్తున్న తొలి రైలు ఇదే కావడం గమనార్హం.

Also Read: బీమా పాలసీలను తీసుకుంటున్నారా.. చేయకూడని తప్పులు ఇవే..?

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మీడియాతో మాట్లాడుతూ ఈ రైలుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. దేశంలోని మెట్రో రైళ్ల ద్వారా ఎక్కువ సంఖ్యలో ప్రయాణం చేసే నగరాల్లో ఢిల్లీ కూడా ఒకటి. ప్రతిరోజూ ఢిల్లీలోని 25 లక్షల నుంచి 30 లక్షల మంది మెట్రో సర్వీసులను వినియోగించుకుంటారు. దాదాపు 18 సంవత్సరాల క్రితం ఢిల్లీలో మెట్రో సర్వీసులు ప్రారంభమయ్యాయి.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 2002 సంవత్సరంలో ఢిల్లీ నగరంలో మెట్రో సర్వీసులను ప్రారంభించారు. మెట్రో సర్వీసులు ప్రారంభమై దాదాపు 18 సంవత్సరాలు కావడంతో డ్రైవర్ లేని రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తున్నట్టు ఢిల్లీ రైల్వే అధికారులు వెల్లడించారు. వచ్చే ఏడాది ఉంచి ఈ రైలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానుందని సమాచారం.