దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ కోర్సులు నేర్చుకునే ఛాన్స్.?

దేశంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన ఈ-గవర్నెన్స్ సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు టెక్నికల్ కోర్సులు నేర్చుకునే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులు 3డీ ప్రింటింగ్, సైబర్ భద్రత కోర్సులను నేర్చుకునే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తూ ఉండటం గమనార్హం. Also Read: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. రెండు కీలక నిర్ణయాలు..? కేంద్రం ఇందుకోసం ఫ్రాన్స్ దేశానికి […]

Written By: Kusuma Aggunna, Updated On : December 26, 2020 12:16 pm
Follow us on


దేశంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన ఈ-గవర్నెన్స్ సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు టెక్నికల్ కోర్సులు నేర్చుకునే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులు 3డీ ప్రింటింగ్, సైబర్ భద్రత కోర్సులను నేర్చుకునే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తూ ఉండటం గమనార్హం.

Also Read: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. రెండు కీలక నిర్ణయాలు..?

కేంద్రం ఇందుకోసం ఫ్రాన్స్ దేశానికి చెందిన ఎకోల్ సుపీరియర్ రాబర్ట్ డి సార్బన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎస్‏సీ అకాడమీ కేంద్రాల ద్వారా గ్రామీణ నిరుద్యోగులు, విద్యార్థులు ఈ కోర్సులను నేర్చుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న సీఎస్‏సీ అకాడమీ కేంద్రాల ద్వారా ఈ కోర్సులలో జాయిన్ కావడంతో పాటు నేర్చుకునే అవకాశం ఉంటుంది. సమీపంలోని సీఎస్‏సీ అకాడమీ కేంద్రాలను సందర్శించి ఈ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Also Read: ఏపీలో డీఎస్సీ రాసేవాళ్లకు అలర్ట్.. ఆ సిలబస్ లో మార్పు..?

సీఎస్‏సీ ఎండీ దినేశ్ త్యాగి దినేష్ త్యాగి మాట్లాడుతూ గ్రామీణ యువతకు టెక్నికల్ కోర్సులు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కోర్సులను అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించారు. యువత ఈ కోర్సుల్లో శిక్షణ తీసుకోవడం వల్ల వారిలో నైపుణ్యాలతో పాటు వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది. ఎకోల్ సుపీరియర్ సంస్థ నాన్ ప్రొఫీట్ కంపెనీ కావడంతో యువతకు ప్రయోజనం చేకూరుతోంది.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

ప్రస్తుతం దేశంలో 5,000 సీఎస్‏సీ అకాడమీ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం టెక్నికల్ కోర్సులు ఈ కేంద్రాలలోని నిరుద్యోగులకు అందుబాటులోకి రానున్నాయి. కేంద్రం సీఎస్‏సీ అకాడమీ కేంద్రాల సంఖ్యను భారీగా పెంచాలని భావిస్తోంది.