Deshmuduru Collections : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కెరీర్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘దేశముదురు’ చిత్రం స్పెషల్ షోస్ ని నిన్నటి నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే.అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ఈ చిత్రం రీ రిలీజ్ ట్రెండ్ లో డిజాస్టర్ అవుతుందేమో అని భయపడ్డారు కానీ, మొదటి రోజు షో టైం కి టికెట్స్ బాగానే తెగాయి.
అల్లు అర్జున్ కి టీనేజీ పిల్లల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని విశ్లేషకులు అంటుంటారు.నిన్న థియేటర్స్ వద్దకి వెళ్లి చూస్తే అది నిజమే అన్న విషయం అర్థం అవుతుంది.కొన్ని చోట్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన సంబరాలు చూసి విశ్లేషకులు సైతం అష్క్యార్యపొయ్యారు.చాలా మంది స్టార్ హీరోలకు ఈ రేంజ్ లో ఈమధ్య థియేటర్స్ వద్ద సంబరాలు జరగలేదు.
ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు ఉత్తరాంధ్ర లో 33 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.ఇది ఆ ప్రాంతం లో ఇప్పటి వరకు రీ రిలీజ్ అయినా సినిమాలలో ఆల్ టైం రికార్డు అట.నైజం ప్రాంతం లో 68 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.ఇది ఊహించిన దానికంటే ఎక్కువే అని చెప్పొచ్చు, అలా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొదటి రోజు కోటి 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక రెండవ రోజు కొత్త సినిమాలు విడుదల అవ్వడం తో దేశముదురు గ్రాస్ బాగా తగ్గిపోయింది.అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి రెండవ రోజు కేవలం 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.రేపు అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడం, 25 లక్షల రూపాయిల గ్రాస్ అదనంగా వస్తుందని అంటున్నారు.చూడాలి మరి దేశముదురు ఫుల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.