https://oktelugu.com/

ఇవాళ్లి నుంచే ఏపీలో నామినేషన్లు.. కనిపించని ఎన్నికల హడావిడి..కోర్టు తీర్పే కీలకం?

ఏపీ ఎస్ఈఎస్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు.. ఏపీ సీఎం జగన్ మధ్య జరుగుతున్న వార్ పీక్ స్టేజికి చేరింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినా విశాఖ జిల్లా అధికారులు మాత్రం అదేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. వ్యాక్సినేషన్ పూర్తయ్యేంత వరకు ఎన్నికల విధులు నిర్వహించలేమంటూ జిల్లా ఉద్యోగ సంఘాలు ఖరాఖండిగా చెప్పేస్తున్నాయి. దీంతో సోమవారం వెలువడనున్న సుప్రీంకోర్టు తీర్పుపైన అందరి దృష్టి నెలకొంది. ఏపీలో ఎస్ఈసీ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 25, 2021 / 09:14 AM IST
    Follow us on

    ఏపీ ఎస్ఈఎస్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు.. ఏపీ సీఎం జగన్ మధ్య జరుగుతున్న వార్ పీక్ స్టేజికి చేరింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినా విశాఖ జిల్లా అధికారులు మాత్రం అదేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. వ్యాక్సినేషన్ పూర్తయ్యేంత వరకు ఎన్నికల విధులు నిర్వహించలేమంటూ జిల్లా ఉద్యోగ సంఘాలు ఖరాఖండిగా చెప్పేస్తున్నాయి. దీంతో సోమవారం వెలువడనున్న సుప్రీంకోర్టు తీర్పుపైన అందరి దృష్టి నెలకొంది.

    ఏపీలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసినా కూడా ఆ సందడి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇటు రాజకీయ పార్టీలకు.. అటు అధికార యంత్రాంగానికి బోలెడంత పని. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచే అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లు, ప్రచారాలతో నేతలంతా బిజీగా ఉంటే.. అటు అధికార యంత్రాంగం కూడా ఎన్నికల కోడ్ అమలు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, నామినేషన్ల స్వీకరణ వంటి విధుల్లో ఉన్నతాధికారులు బిజీగా ఉంటారు.

    కానీ ఈసారి ఆ సందడి లేదు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఎన్నికలను వ్యతిరేకిస్తోంది. ఏపీ జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఎవరూ నిమ్మగడ్డ వీడొయో కాన్ఫరెన్స్ కు హాజరు కాలేదు. ఆదివారం కూడా ఏపీ ప్రభుత్వం తరుఫున ఒక్క పని కూడా చేయలేదు. ఏ ఒక్క అధికారి ఏపీలో పంచాయితీ ఎన్నికల పనుల్లో భాగస్వాములు కాలేదు.

    ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఇప్పుడు పంచాయితీ ఎన్నికలపై ప్రతిష్టంభన నెలకొంది. దీంతో పంచాయితీ ఎన్నికలపై సోమవారం వెలువడనున్న సుప్రీంకోర్టు తీర్పు కీలకంగా మారింది. ఈ తీర్పుతో ఉత్కంఠకు తెరపడనుంది.