Delhi Minor Girl Case: ఢిల్లీలో 16 సంవత్సరాల బాలికను అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆ బాలికను హతమార్చిన తర్వాత నిందితుడు ఉత్తర ప్రదేశ్ లోని బులంద్ షహర్ ప్రాంతానికి పారిపోయాడు. అయితే బాలికను అంతమొందించిన తర్వాత పోలీసులకు దొరకకుండా ఉండేందుకు షాహిల్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో అతడి పై పోలీసులు మరింత దృష్టి సారించారు. ఇక్కడ అతడు చేసిన పొరపాటు పోలీసులకు పట్టించింది.
విస్తుపోయే వాస్తవాలు
ఢిల్లీ బాలిక హత్య కేసులో పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో దిగ్భ్రాంతి కరమైన వాస్తవాలు కళ్లకు పడుతున్నాయి. షాబాద్ డెయిరీ ప్రాంతంలో అత్యంత వాసవికంగా పదహారేళ్ల బాలికను హతమార్చిన 20 ఏళ్ల నిందితుడు షాహిల్.. ఆ తర్వాత పరారయ్యాడు. ఈ ఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడం, ఢిల్లీ ముఖ్యమంత్రి ట్విట్టర్లో స్పందించడం, జాతీయ మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేయడంతో ఢిల్లీ పోలీసులు సవాల్ గా తీసుకున్నారు. సాంకేతిక ఆధారాల ప్రకారం షాహిల్ ఉత్తర ప్రదేశ్ లోని బులంద్ షహర్ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొన్నారు. ఆ ఘటన తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన షాహిల్.. పారిపోయిన తర్వాత తన తండ్రికి ఫోన్ చేశాడు. దీంతో అతడి సెల్ ఫోన్ సిగ్నల్ సాధారణంగా ఆచూకీని పోలీసులు కనిపెట్టారు.
ప్రత్యేకమైన నిఘా
బాలికను చంపిన తర్వాత ఉత్తర ప్రదేశ్ లోని బులంద్ షహర్ ప్రాంతాల్లోని తన అత్త ఇంటికి షాహిల్ పారిపోయాడు. ఈ హత్య తర్వాత పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు అతడు తన ఫోన్ స్విచాఫ్ చేశాడు. దీంతో పోలీసులకు అతడిని పట్టుకోవడం కష్టమైపోయింది. అతడి ఫోన్ ను పోలీసులు ట్రాక్ చేయడం ప్రారంభించారు. బులంద్ షహర్ చేరుకున్న షాహిల్.. తన ఫోన్ నుంచి తండ్రికి ఫోన్ చేయడంతో అతడి ఆచూకీ పోలీసులకు లభ్యమైనది. దీంతో ప్రత్యేకమైన బృందాలు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. ఢిల్లీలో షాబాద్ డెయిరీ ప్రాంతంలో ఆదివారం 16 ఏళ్ల బాలికను నిందితుడు అత్యంత దారుణంగా హతమార్చాడు. కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. 21సార్లు ఆమె శరీరం పై దాడి చేశాడు. అతడు దాడి చేసిన కత్తి మృతురాలి పుర్రెలో ఇరుక్కుపోయింది అంటే అతడు ఎంత పాసవికంగా పొడిచాడో అర్థం చేసుకోవచ్చు. అప్పటికే బాలిక చనిపోయి రక్తం మడుగులో పడిపోయింది. అప్పటికి తన పగ చల్లారకపోవడంతో ఆమె మృతదేహాన్ని కాలితో తన్నాడు. బండరాయితో ఆమె మృహదేహాన్ని మోదాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మొత్తం సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అయితే ఇంతటి దారుణం జరుగుతున్నప్పటికీ ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం విశేషం.
కేసు నమోదు
సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతని చేతి పై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఈ దాడిలో బాలిక పుర్రె పగిలిపోయినట్టు ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు వెల్లడించారు. ఇంకా పూర్తి పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది. మృతురాలు, నిందితుడు గత కొద్దిరోజులుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. వీరికి ఇటీవల గొడవ జరిగింది. హత్య జరిగే ముందు కూడా మరోసారి ఇద్దరూ గొడవపడ్డారు. అయితే ఆ బాలిక షాహిల్ ను దూరం పెట్టేందుకు ప్రయత్నించింది. వెంటపడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. ఫలితంగా అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు చెబుతున్నారు.