Miss Shetty Mr Polishetty: జాతి రత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి మరియు అనుష్క శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘భాగమతి’ తర్వాత అనుష్క మరియు ‘జాతి రత్నాలు’ తర్వాత నవీన్ పోలిశెట్టి కలిసి చేస్తున్న చిత్రమిది. ఇద్దరు వెండితెర కనిపించి చాలా కాలమే అయ్యింది. ముఖ్యంగా అనుష్క ని వెండితెర పై చూడాలని అభిమాలు సుమారుగా నాలుగేళ్ల నుండి ఎదురు చూస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో గత కొంత కాలం నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు చివరి దశకి చేరుకుంది. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు. ‘హతవిధీ’ అంటూ సాగే ఈ పాటని తమిళ స్టార్ హీరో ధనుష్ పాడారు.
ధనుష్ మంచి నటుడు మాత్రమే కాకుండా మంచి గాయకుడు కూడా అనే విషయం అందరికీ తెలిసిందే.ఆయన పాడిన ‘వై థిస్ కొలవరి’ అనే పాట ఇండియా ని ఒక ఊపు ఊపేసింది. ఆ తర్వాత కూడా ఆయన తమిళం లో కొన్ని సినిమాలకు పాటలు పాడాడు. ఆయన గొంతు ప్రొఫెషినల్ సింగర్ లాగానే అనిపించడం విశేషం. ఇక నేడు విడుదలైన ‘హతవిది’ అనే సాంగ్ లో ధనుష్ తన అద్భుతమైన గొంతు తో మదన్ కంపోజ్ చేసిన ట్యూన్ కి ప్రాణం పోసాడు.
హీరో ఉద్యోగం లేక తన ఇంట్లో ఖాళీగా కూర్చొని ఇంటి పనులు చేస్తూ, బయట ఆవారా లాగ తిరుగుతున్నా సందర్భం ని పాట గా చూపించారు. రామ జోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ యూత్ కి బాగా దగ్గర అయ్యే విధంగా ఉన్నాయి. ఈ పాటకి సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్ ని క్రింద అందిస్తున్నాము చూడండి.