Deepika Padukone: జనరేషన్స్ మారే కొద్ది ఒకప్పటి సంప్రదాయాలు కనుమరుగవుతూ వస్తున్నాయి. గతంలో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ సిల్వర్ స్క్రీన్ కి గుడ్ బై చెప్పేసేవారు. పిల్లల్ని కని వాళ్ళ బాధ్యతలు నెరవేరాక క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేవారు. తర్వాత జెనరేషన్ హీరోయిన్స్ పెళ్లి చేసుకున్నప్పటి భర్తల అనుమతితో స్కిన్ షో చేయకుండా, బోల్డ్ సీన్స్ లో నటించకుండా పద్ధతి గల పాత్రలు చేశారు. అయితే ఈ జనరేషన్ మాత్రం పెళ్ళైతే ఏంటి… ప్రొఫెషన్ కి పర్సనల్ లైఫ్ కి సంబంధం లేదంటున్నారు.

ముద్దులు పెట్టుకున్నా, పొట్టి బట్టలు వేసుకున్నా అంతా నటనలో భాగమే కాబట్టి… పెళ్లి అడ్డు కాదంటున్నారు. ఒకప్పటి తెలుగింటి కోడలైన సమంత కూడా అదే తరహాలో రెచ్చిపోయింది. నాగ చైతన్యతో పెళ్లి అయ్యాక కూడా ఆమె సూపర్ డీలక్స్ మూవీ, ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్లో బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. అభిషేక్ ని వివాహం చేసుకున్న ఐశ్వర్య రాయ్.. ధూమ్ 2 మూవీలో హృతిక్ రోషన్ తో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది. ఒకరి వైఫ్ అయ్యాక కూడా ఇలాంటి డేరింగ్ స్టెప్స్ తీసుకుంటున్న హీరోయిన్స్ ఎక్కువైపోయారు.
తాజాగా దీపికా పదుకొనె మరింత దారుణానికి ఒడిగట్టింది. ఆమె లేటెస్ట్ మూవీ పఠాన్. చాలా గ్యాప్ అనంతరం షారుక్ ఖాన్ కసిగా ఈ చిత్రం చేశారు. జాన్ అబ్రహం కీలక రోల్ చేస్తున్న పఠాన్ 2023 జనవరి 25న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ మూవీలో దీపికా పదుకొనె ఒక సాంగ్ కోసం బికినీలో టెంపరేచర్ పనిచేసింది. గోల్డ్ కలర్ బికినీలో దీపికా అందాల ప్రదర్శన చేసింది. వివాహిత దీపిక ఈ రేంజ్ లో స్కిన్ షో చేయడం హాట్ టాపిక్ అవుతుంది.

2018లో హీరో రణ్వీర్ సింగ్ ని దీపికా పదుకొనె వివాహం చేసుకున్నాడు. పెళ్ళై నాలుగేళ్లు అవుతున్నా ఈ జంట ఫ్యామిలీ ప్లానింగ్ చేయలేదు. ఇద్దరూ కెరీర్స్ లో బిజీగా ఉంటూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటున్నారు. పేరుకే భార్యాభర్తలు కానీ వీరి మధ్య పెద్ద అఫెక్షన్ కనిపించదు. చాలా ఆర్టిఫీషియల్ గా వీరి రిలేషన్ తోస్తుంది. హీరో రన్బీర్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన దీపిక బ్రేకప్ కారణంగా పిచ్చిదై పోయింది. ఇప్పటికీ ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్నారని సమాచారం