Rashmi Gautam: స్టార్ యాంకర్ రష్మీ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె తన డియరెస్ట్ పర్సన్ ని కోల్పోయారు. దీంతో వేదన చెందుతూ సోషల్ మీడియాలో ఈ విషయం తెలియజేశారు. రష్మీ గౌతమ్ గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా కన్నుమూశారు. బామ్మ మరణాన్ని ఉద్దేశిస్తూ రష్మీ గౌతమ్ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. ఇవాళ మా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మా గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రాకు అంతిమ వీడ్కోలు పలికాము. ఆమె చాలా స్ట్రాంగ్ ఉమన్. నాపై ఆమె ప్రభావం ఎంతగానో ఉంది. భౌతికంగా దూరం అయినప్పటికీ తన జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి…. అని ఒక సందేశం పోస్ట్ చేశారు.

రష్మీ గ్రాండ్ మదర్ మరణవార్త తెలుసుకున్న అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. వారి కుటుంబానికి దేవుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారు. కాగా రష్మీ తల్లి సింగిల్ పేరెంట్. నాన్నగారు చిన్నప్పుడే వాళ్ళను వదిలి వెళ్ళిపోయాడు. భర్త వదిలేసినప్పటికీ రష్మీ తల్లిగారు కూతురిని పెంచి పెద్ద చేశారు. ఈ విషయాన్ని రష్మీ గౌతమ్ పలు సందర్భాల్లో వెల్లడించారు. అనేక కష్టనష్టాలు పడి తన తల్లి పెంచినట్లు చెప్పి కన్నీరు పెట్టుకున్నారు.
ఇక రష్మీ అనుబంధం కలిగి ఉన్న అతి కొద్ది మంది ఫ్యామిలీ మెంబర్స్ లో గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా ఒకరని తెలుస్తుంది. ఆమె దూరం కావడంతో రష్మీ ఎమోషనల్ అయ్యారు. తన గ్రేట్ లాస్ ని అభిమానులకు తెలియజేసి ఆవేదన చెందారు. రష్మీ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. కాగా రష్మీ అనేక ఇబ్బందులు ఎదుర్కొని స్టార్ యాంకర్ రేంజ్ కి ఎదిగారు. ఆమె హీరోయిన్ కావాలనే ఆశతో పరిశ్రమలో అడుగు పెట్టారు.

అయితే హీరోయిన్ ఫ్రెండ్, వ్యాంప్ రోల్స్ మాత్రమే ఆమెకు వచ్చేవి. ఏళ్ల తరబడి ఎదురు చూసినా బ్రేక్ రాలేదు. దీంతో యాంకర్ అవతారం ఎత్తారు. జబర్దస్త్ యాంకర్ గా ఉన్న అనసూయ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. ఆమె స్థానంలోకి రష్మీ వచ్చారు. అనసూయను మరిపించి జబర్దస్త్ లో స్టార్ యాంకర్ గా రష్మీ ఎదిగారు. జబర్దస్త్ ఉహించని సక్సెస్ సాధించడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా స్టార్ట్ చేశారు. దాని వలన అనసూయకు రీఎంట్రీ ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం రష్మీ నటిగా, యాంకర్ గా కొనసాగుతున్నారు. హీరోయిన్ కావాలన్న తన కల కూడా నెరవేరింది.