Pushpa 2- Jagapathi Babu: పుష్ప విడుదలై ఏడాది దాటిపోయింది. ఇటీవలే పార్ట్ 2 షూటింగ్ మొదలుపెట్టారు. హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ ముగించిన యూనిట్… సెకండ్ షెడ్యూల్ కోసం వైజాగ్ వచ్చారు. మన్యం అడవుల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం. అల్లు అర్జున్ వైజాగ్ వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఎయిర్ పోర్ట్ వద్దకు పెద్ద ఎత్తున పోటెత్తారు. అల్లు అర్జున్ కి ఘన స్వాగతం పలికారు. కాగా సీక్వెల్ పుష్ప ది రూల్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. వెయ్యి కోట్ల వసూళ్లే లక్ష్యంగా మేకర్స్ ముందుకు వెళుతున్నారు. బడ్జెట్ సైతం రూ. 300 వరకూ పెంచారు. స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశారు.

పాన్ ఇండియా అప్పీల్ కోసం ఇతర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులను తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పుష్ప 2 టీంలో జగపతి బాబు అలియాస్ జగ్గూభాయ్ జాయిన్ అయ్యారంటున్నారు. మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారట. అధికారిక ప్రకటన రాకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. సుకుమార్ కి జగపతి బాబు హిట్ సెంటిమెంట్ గా ఉన్నారు. ఆయన ప్లాప్ లో ఉన్నప్పుడు చేసిన నాన్నకు ప్రేమతో మూవీలో జగపతి బాబు విలన్ రోల్ చేశారు. నాన్నకు ప్రేమతో హిట్ కొట్టింది.
ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాన్నకు ప్రేమతో మూవీలో క్లాస్ విలన్ గా చూపించిన సుకుమార్ రంగస్థలంలో జగపతిబాబును ఊర మాస్ పశుపతి పాత్రలో ప్రజెంట్ చేశారు. జగపతిబాబు ఆ రెండు రోల్స్ లో లీనమై నటించారు. ముఖ్యంగా రంగస్థలం మూవీలో జగపతి బాబు నటన, పాత్ర అద్భుతంగా ఉంటాయి. ఈ క్రమంలో జగపతిబాబు సెంటిమెంట్ కలిసొస్తే సుకుమార్ కి మరో ఇండస్ట్రీ హిట్ పడటం ఖాయం.

కాగా పుష్ప 2 వచ్చే ఏడాది విడుదల కానుంది. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్. పార్ట్ 2 లో ఆమె పాత్రపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. శ్రీవల్లి పాత్ర చనిపోతుందంటూ కథనాలు వెలువడుతున్నాయి. అనసూయ దాక్షాయణి గా నెగిటివ్ రోల్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి, సాయి పల్లవి నటిస్తున్నారంటూ పుకార్లు ఉన్నాయి. అధికారిక సమాచారం లేదు.