డప్పుల శబ్దం విని లేచిన శవం.. చివరకు?

చనిపోయిన మనిషి బ్రతకటం సాధ్యమవుతుందా..? అనే ప్రశ్నకు నూటికి నూరు శాతం మంది కాదనే చెబుతారు. అయితే దేశంలోని పలు ప్రాంతాల్లో చోటు చేసుకునే వింత ఘటనలు మాత్రం చనిపోయిన మనిషి మళ్లీ బ్రతికినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమయ్యేలా చేస్తాయి. తాజాగా మెదక్ జిల్లాలోని చేగుంటలో చనిపోయిన మనిషి మళ్లీ బ్రతికాడు. దీంతో స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. Also Read: ఆ ప్రాంతంలో వెనక్కు వెళ్లిన సముద్రం.. సునామీకి సంకేతమా..? […]

Written By: Kusuma Aggunna, Updated On : October 5, 2020 5:23 pm
Follow us on

చనిపోయిన మనిషి బ్రతకటం సాధ్యమవుతుందా..? అనే ప్రశ్నకు నూటికి నూరు శాతం మంది కాదనే చెబుతారు. అయితే దేశంలోని పలు ప్రాంతాల్లో చోటు చేసుకునే వింత ఘటనలు మాత్రం చనిపోయిన మనిషి మళ్లీ బ్రతికినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమయ్యేలా చేస్తాయి. తాజాగా మెదక్ జిల్లాలోని చేగుంటలో చనిపోయిన మనిషి మళ్లీ బ్రతికాడు. దీంతో స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు.

Also Read: ఆ ప్రాంతంలో వెనక్కు వెళ్లిన సముద్రం.. సునామీకి సంకేతమా..?

పూర్తి వివరాల్లోకి వెళితే చంద్రమోహన్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఆస్పత్రిలో చికిత్స చేయించినా అతని ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. శనివారం రోజు సాయంత్రం చంద్రమోహన్ గుండె కొట్టుకోకపోవడం, శ్వాస తీసుకోకవడంతో అతను చనిపోయాడని కుటుంబ సభ్యులతో పాటు అందరూ భావించారు. చంద్రమోహన్ అంత్యక్రియలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లే సమయంలో డప్పులు కొట్టడంతో ఆ శబ్దానికి చనిపోయిన చంద్రమోహన్ లేచాడు. దీంతో అక్కడున్న వారికి కొంత సమయం పాటు ఏం జరిగిందో అర్థం కాలేదు. వెంటనే చంద్రమోహన్ కుటుంబ సభ్యులు అతనిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అయితే ఆస్పత్రికి వెళ్లే మార్గమధ్యంలోనే చంద్రమోహన్ చనిపోయాడు. దీంతో చంద్రమోహన్ బ్రతికాడన్న ఆశ కాస్తా అడియాశ అయింది.

Also Read: భారత్ లో కరోనా మరణాలు తగ్గడానికి అసలు కారణమిదే..?

చివరకు చేసేదేం లేక కుటుంబ సభ్యులు చంద్రమోహన్ మృతదేహాన్ని శ్మశానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. చనిపోయిన చంద్రమోహన్ డప్పు శబ్దానికి లేవడంతో స్థానికంగా ఈ ఘటన వైరల్ అయింది. అయితే చనిపోయిన వ్యక్తి కొంత సమయంలో మళ్లీ ఎలా బ్రతికాడనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు.