థియేటర్లు రెడీకానీ.. సినిమాలే లేవా?

దేశంలో లాక్డౌన్.. కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు మూతపడిన సంగతి తెల్సిందే. అన్నిరంగాలకు మినహాయింపులు ఇస్తూ వెళ్లిన ప్రభుత్వం థియేటర్ల విషయంలో మాత్రం సానుకూలంగా స్పందించలేదు. అక్టోబర్ 15 నుంచి 50శాతం అక్యుపెన్సీతో థియేటర్ల ఓపెనింగ్ కు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ఏడునెలల అనంతరం సినిమా థియేటర్లు ఓపెన్ కాబోతున్నాయి. కేంద్రం మార్గదర్శకాల మేరకు కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు ఓపెన్ చేసేందుకు యాజమాన్యాలు రెడీ అవుతున్నాయి. అయితే థియేటర్లలో సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఏమేరకు […]

Written By: NARESH, Updated On : October 5, 2020 3:57 pm
Follow us on

దేశంలో లాక్డౌన్.. కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు మూతపడిన సంగతి తెల్సిందే. అన్నిరంగాలకు మినహాయింపులు ఇస్తూ వెళ్లిన ప్రభుత్వం థియేటర్ల విషయంలో మాత్రం సానుకూలంగా స్పందించలేదు. అక్టోబర్ 15 నుంచి 50శాతం అక్యుపెన్సీతో థియేటర్ల ఓపెనింగ్ కు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ఏడునెలల అనంతరం సినిమా థియేటర్లు ఓపెన్ కాబోతున్నాయి.

కేంద్రం మార్గదర్శకాల మేరకు కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు ఓపెన్ చేసేందుకు యాజమాన్యాలు రెడీ అవుతున్నాయి. అయితే థియేటర్లలో సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఏమేరకు వస్తారనే సందేహాలు కలుగుతున్నాయి. దీనికితోడు కొత్త సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు టాలీవుడ్ నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

కరోనా పరిస్థితుల్లోనూ ప్రేక్షకులు  థియేటర్లకు రావాలంటే అందుకు తగ్గ కంటెంట్ ఉన్న సినిమా నడుస్తూ ఉండాలి. ప్రస్తుతం ఉన్న సినిమాల్లోనూ ఏ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలు అందుకోనేలా కన్పించడం లేదు. కొత్త సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేసే విషయంలో ఏ ఒక్క నిర్మాత కూడా స్పందించడం లేదు.

చిన్న సినిమాలు ప్రదర్శిస్తే ఈమేరకు ప్రేక్షకులు వస్తారనే సందేహాలు ఉన్నాయి. ఇక పాత సినిమాలతో కొద్దిరోజులు థియేటర్లు నడిపిద్దామనుకుంటే ప్రేక్షకులు థియేటర్లకు అసలు రాకపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ సినిమాల విషయంలో నిర్మాతలు ఎలాంటి అగ్రిమెంట్లు చేసుకున్నారో తెలియడం లేదు. దీంతో థియేటర్లు తెరిచినా కొత్త సినిమాలు ప్రదర్శించకపోతే ఉపయోగం లేదనే టాక్ విన్పిస్తోంది.

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే క్రిస్మస్.. సంక్రాంతి నాటికి గానీ థియేటర్లు కళకళలాడేలా కన్పించడం లేదు. సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే తప్ప థియేటర్లలో ప్రేక్షకుల సందడి కన్పించదనే టాక్ విన్పిస్తోంది. ప్రస్తుతానికి థియేటర్లు ఓపెన్ అయినా నామమాత్రంగానే కొనసాగాల్సిందేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.