https://oktelugu.com/

అల్లు అర్జున్ కు కూతురి అందమైన బహుమతి

కోవిడ్ -19 పాజిటివ్ నుంచి కోలుకుంటున్న అల్లు అర్జున్‌కు తన ముద్దుల కుమార్తె అల్లు అర్హా నుంచి అందమైన బహుమతి లభించింది. 4 ఏళ్ల అందమైన అర్హా నాన్న కోసం రుచికరమైన దోసలు చేయడం విశేషం. అల్లు అర్జున్ ఈ సంతోషకరమైన క్షణాన్ని ఆన్‌లైన్‌లో అభిమానులు పంచుకున్నారు. నా కూతురు నాన్న కోసం దోసెలు ఎలా చేసిందో చూడండి అని బన్నీ ఉబ్బితబ్బిబవుతున్నాడు.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో దీన్ని అల్లు అర్జున్ పంచుకున్నారు. “అర్హా చేత మరపురాని […]

Written By:
  • NARESH
  • , Updated On : May 5, 2021 / 07:16 PM IST
    Follow us on

    కోవిడ్ -19 పాజిటివ్ నుంచి కోలుకుంటున్న అల్లు అర్జున్‌కు తన ముద్దుల కుమార్తె అల్లు అర్హా నుంచి అందమైన బహుమతి లభించింది. 4 ఏళ్ల అందమైన అర్హా నాన్న కోసం రుచికరమైన దోసలు చేయడం విశేషం. అల్లు అర్జున్ ఈ సంతోషకరమైన క్షణాన్ని ఆన్‌లైన్‌లో అభిమానులు పంచుకున్నారు. నా కూతురు నాన్న కోసం దోసెలు ఎలా చేసిందో చూడండి అని బన్నీ ఉబ్బితబ్బిబవుతున్నాడు..

    తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో దీన్ని అల్లు అర్జున్ పంచుకున్నారు. “అర్హా చేత మరపురాని దోస” అని బన్నీ రాసుకొని మురిసిపోయాడు. అలా వైకుంఠపురంలో లోని ‘రాములో రాములా’ పాటలోని తన ‘దోసా స్టెప్’ గురించి ప్రస్తావిస్తూ అల్లు అర్జున్, “నేను ఊహించిన నానా దోస ఇదే. ఆ స్టెప్ కోసం అర్హ దోస నుంచే ప్రేరణ పొందాను.” అని బన్నీ కూతురు దోసపై ఆనందం వ్యక్తం చేశాడు.

    అందమైన అర్హా చాలా చురుకుగా నాన్న కోసం ఈ వీడియోలో దోసలు వేసింది. అర్హా ఇంతకుముందు మణిరత్నం -ఇలయరాజా క్లాసిక్ 1990 చిత్రం ‘అంజలి’ మూవీలోని అంజలి అంజలి కవర్ సాంగ్ లో నటించి మెప్పించింది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న అల్లు అర్జున్ కోసం దోస వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది, బేబీ షామిలి వలే అందంగా క్యూట్ గా ఉన్న అర్హా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.