
Das Ka Dhamki Twitter Review: యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ దాస్ కా ధమ్కీ. ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రావడంతో సినిమాకు మంచి ప్రచారం దక్కింది. అనూహ్యంగా దాస్ కా ధమ్కీ చిత్రాన్ని నందమూరి ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు. ఎన్టీఆర్, బాలయ్య ఆయనకు సప్పోర్ట్ చేయడమే దీనికి కారణం. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ విశ్వక్ సేన్ ని ఓ రేంజ్ లో పొగిడారు. అలాగే బాలయ్యను కలిసి విశ్వక్ సేన్ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. దాస్ కా ధమ్కీ చిత్రానికి విశ్వక్ సేన్ దర్శకుడు కూడా కావడం విశేషం. తాను అనుకున్న కథ వేరే దర్శకులు తన ఆలోచన ప్రకారం తెరకెక్కించలేరని నమ్మిన విశ్వక్ సేన్ సొంతగా డైరెక్ట్ చేశారు.
దాస్ కా ధమ్కీ చిత్రం పలు భాషల్లో విడుదల చేశారు. ట్రైలర్, సాంగ్స్ మూవీ మీద అంచనాలు పెంచాయి. ప్రోమోలు ఆకట్టుకోగా చిత్రం మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. దాస్ కా ధమ్కీ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించారు. గతంలో ఈ జంట పాగల్ మూవీలో కలిసి జతకట్టారు. ఇక దాస్ కా ధమ్కీ చిత్రాన్ని విశ్వక్ సేన్ లవ్, రొమాన్స్, యాక్షన్, కామెడీ వంటి అంశాలు జోడించి కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందించారు.
దాస్ కా ధమ్కీ ఉగాది కానుకగా మార్చి 22న విడుదల చేశారు. యూఎస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో టాక్ బయటకు వచ్చింది. దాస్ కా ధమ్కీ చిత్రం చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయం సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. ఇక సినిమాకు మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. కొందరు సినిమా చాలా బాగుందంటుండగా మరికొందరు పర్లేదు, యావరేజ్ అన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు.

మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయంలో ఫస్ట్ హాఫ్ బాగుంది. కామెడీ, రొమాంటిక్ సన్నివేశాలతో విశ్వక్ సేన్ సినిమాను బాగా ఎంగేజ్ చేశారు. ఇంటర్వెల్ బ్యాంగ్ సైతం ఆకట్టుకుంటుంది. అయితే సెకండ్ హాఫ్ అనుకున్నంత స్థాయిలో లేదు. అనవసరమైన ట్విస్ట్స్ ఎక్కువైపోయాయి. స్క్రీన్ ప్లే కన్ఫ్యూజింగ్ గా సాగిందంటున్నారు. సన్నివేశాలు ఇంకొంచెం బలంగా రాసుకుంటే బాగుండేదని అంటున్నారు.
అయితే మరికొందరు ఆడియన్స్ పూర్తిగా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దాస్ కా ధమ్కీ అన్ని విధాలుగా బాగుంది. కామెడీ, రొమాన్స్, యాక్షన్ అలరించాయి. హీరో విశ్వక్ డైరెక్షన్, యాక్టింగ్ అద్భుతం అంటున్నారు. నెగిటివ్ కామెంట్స్ మీద ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ లోని నెగిటివ్ రివ్యూస్ పట్టించుకోకుండా… సినిమా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలంటున్నారు. ఈ క్రమంలో పూర్తి రివ్యూ వస్తే కానీ దాస్ కా ధమ్కీ చిత్ర ఫలితం మీద ఒక అవగాహన రాదు.
#DaskaDhamki Overall a Strictly Below Par Movie!
After an okayish 1st half with some fun scenes, the entertainment zone gets completely sidelined and the movie goes downhill with over the top scenes, ineffective twists, and substandard screenplay.
Rating: 2.25/5
— Venky Reviews (@venkyreviews) March 22, 2023
https://twitter.com/ERESHAM1/status/1638364408769568768?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1638364408769568768%7Ctwgr%5E1f9c05d130d3fa5bc42b7f1a660b801ff75e1ac0%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.filmibeat.com%2Fnews%2Fvishwak-sen-starrer-das-ka-dhamki-movie-twitter-review-118278.html
Actor Vishwa : 4/5
Writer vishwa : 3.5/5
Director Vishwa : 3/5
Overall.. No story 1st half, only story 2nd half
Predictable Twists,though..
Watch it for @VishwakSenActor 3.25/5 #DaskaDhamki pic.twitter.com/MrFAIYjsDA— AN (@anurag_i_am) March 22, 2023
https://twitter.com/Thyveiw/status/1638385228153782275