
Pawan Kalyan- BJP: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత బిజెపి – జనసేన పెరిగిన అగాధంతో టిడిపి యమా ఖుషి అవుతోంది. బిజెపి రూట్ మ్యాప్ కోసం నిరీక్షిస్తున్న పవన్.. తాజా బిజెపి నేతలు వ్యాఖ్యలతో టిడిపికి లైన్ క్లియర్ చేసే అవకాశం కనిపిస్తుంది.
ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు జోరుగా మారుతున్నాయి. బిజెపి – జనసేన మధ్య పొత్తు ఉందా లేదా అనేదానికి క్లారిటీ వస్తోంది. అనుకున్న సమయం కంటే ముందుగానే దాదాపు కరారైన పొత్తును అధికారికంగా ప్రకటించేందుకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓడించాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. అందులో భాగంగా బిజెపితో పొత్తులో కొనసాగుతున్న జనసేన అయిష్టంగానే ముందుకు సాగుతోంది. ఇదే సమయంలో బిజెపి జాతీయ నేతల సమక్షంలో పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కొత్త గేమ్ మొదలు పెట్టింది.
పొత్తుపై కీలక వ్యాఖ్యలు..
రాష్ట్రంలో గత కొంతకాలంగా బిజెపి – జనసేన మధ్య పొత్తు కటీఫ్ ఖాయమనే ప్రచారం సాగుతోంది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు బరిలో నిలిచిన జనసేన మద్దతు తెలపలేదు. తాము కోరిన పవన్ ప్రకటన చేయలేదని బిజెపి నేతలు చెబుతున్నారు. జనసేన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయమని మాత్రమే పిలుపు ఇచ్చిందని.. బిజెపికి వేయమని మాత్రం చెప్పకపోవడానికి కమలం పార్టీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. ఇక పవన్ తనతో ఉండే అవకాశం లేదని డిసైడ్ అయ్యారు. జనసేన ఆవిర్భావ సభలోను బిజెపి రాష్ట్ర నాయకత్వాన్ని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యల పైన పార్టీలో చర్చ జరిగింది. బిజెపి జాతీయ నేతలు రాష్ట్రంలో పార్టీ సమావేశం నిర్వహించారు. ఆ వెంటనే పవన్ ను ఉద్దేశించి పార్టీలోని కీలక నేతలు కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తమతో ఉన్నా.. దూరం పాటిస్తున్న పవన్..
జనసేనతో బంధంపైన బిజెపి నేత మాధవ కీలక వ్యాఖ్యలు చేశారు. పేరుకే జనసేన పొత్తు కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము మద్దతు కోరిన జనసేన ముందుకు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. తమతో ఉన్న దూరం పాటిస్తున్న పవన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయంతో పార్టీ ముఖ్య నేతలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆలోచనలో భాగంగానే ఇప్పటివరకు పవన్ లక్ష్యంగా బిజెపి నేతలు మౌనం పాటిస్తూ వచ్చారు. అయితే ఇక ఓపెన్ గా మాట్లాడడం ప్రారంభించడం గమనార్హం. జనసేన తమతో పొత్తులో ఉంటూనే మరో పార్టీకి మేలు చేసేలా వ్యవహరిస్తుందని అభిప్రాయం ఆ పార్టీ నేతలు వ్యక్తం అవుతుంది. బిజెపి జనసేన కలిసి ప్రజల్లోకి వెళ్తేనే పొత్తు ఉంటుందని ప్రజలు నమ్ముతారని మాధవ్ స్పష్టం చేశారు. దీనికి కొనసాగింపుగా ఏపీలో సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నామని పరోక్షంగా తమ లక్ష్యం స్పష్టం చేశారు.

టిడిపి -జనసేన పొత్తుకు లైన్ క్లియర్..
జనసేన బిజెపి మధ్య పొత్తు వికటిస్తున్న నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ కూడా అవే సంకేతాలను ఇస్తూ వచ్చారు. ఇన్నాళ్లు బిజెపి కేంద్ర నాయకత్వం కోసం వేచి చూసే ధోరణితో కనిపించారు. ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం ఓపెన్గా తమ సొంతంగా ఎదగాలని లక్ష్యంతో ఉన్నామని చెప్పటం.. తేన తీరుపైన అసహనం వ్యక్తం చేయడంతో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎప్పటి వరకు వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన మధ్య పొత్తు ఖాయమైన అధికారికంగా వెల్లడించలేదు. ఇప్పుడు బిజెపి తమ జనసేనతో పొత్తులో ఉన్న ఉపయోగం లేదనే విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు పవన్ కు రూట్ క్లియర్ అయింది. ఇక బిజెపితో అధికారంకంగా దూరం అవడం, టిడిపికి దగ్గర అవడం లాంఛనంగా కనిపిస్తోంది. దేశంలో బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలకు జనసేన ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. బిజెపి – జనసేన మధ్య నెలకొన్న తాజా పరిస్థితులు టిడిపికి అనుకూలంగా కనిపిస్తున్నాయన్న చర్చ నడుస్తోంది. బిజెపి అగ్రనాయకత్వం చెబుతుందో అని ఇన్నాళ్లు నిరీక్షించిన పవన్ కళ్యాణ్ కోసం.. టిడిపి పొత్తు వ్యవహారాలను ముందుకు తీసుకెళ్ల లేక పోయింది. బిజెపి కలిసి వస్తుందని జనసేన భావించింది. అందుకు అవకాశం లేకపోవడంతో టీడీపీ జనసేన పొత్తుకు లైన్ క్లియర్ అయినట్లు అయింది. దీంతో తాజా పరిస్థితులు నేపథ్యంలో టిడిపి కాస్త సంతోషిస్తున్నట్లు కనిపిస్తోంది.