Dara Singh Death Anniversary: దారా సింగ్.. ఒకప్పుడు దేశాన్ని ఊపు ఊపిన ఈయన గురించి తెలియని వారు ఉండరు. దారాసింగ్ 10వ వర్ధంతి సందర్భంగా ఇప్పుడు ఆయనను అందరూ స్మరించుకుంటున్నారు. దారా సింగ్ ఒక మల్లయోధుడు. అటు నుంచి నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు. నవంబర్ 19, 1928న దీదార్ సింగ్- రంధవా దంపతులకు జన్మించాడు. దారాసింగ్ కెరీర్.. జీవితకాలమంతా వివిధ రకాల శిరస్త్రాణాలను ధరించాడంటే అతిశయోక్తి కాదు.. దారా సింగ్ చలనచిత్ర నిర్మాతగా పార్లమెంటు సభ్యుడిగా.. అలాగే నటుడిగా.. మల్లయోధుడుగా విభిన్న కళల్లో ఆరితేరాడు.
దారా సింగ్ హిందీ చలనచిత్ర సీమలో అడుగు పెట్టడానికి ముందు చిన్నప్పటి నుండి తనకు ఇష్టమైన చేయవలసిన పెహెల్వానీ (మల్లయుద్ధం) అనే క్రీడను ఆడటం ప్రారంభించాడు. 1949లో సింగపూర్‌లో టైటిల్ గెలిచి దేశానికి మంచి పేరు తీసుకొచ్చాడు. తన కుస్తీ వృత్తిని పతాకస్తాయికి చేర్చడంతో అతడికి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే 1952లో నటనలోకి ప్రవేశించాడు. దారా సింగ్ తన కెరీర్‌లో దాదాపు 150–200 సినిమాలు..టీవీ సిరీస్‌లలో నటించాడు.
రుస్తమ్-ఎ-హింద్ అనే బిరుదు కూడా ఈ దారాసింగ్ కు కేంద్రం ప్రధానం చేసింది. ఆయనకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు ఇవి:
1. రాజ్యసభకు నామినేట్ అయిన మొదటి క్రీడాకారుడు దారాసింగ్.
2. దారా సింగ్ కొన్ని సంవత్సరాలు స్టంట్ సినిమాలలో నటించాడు.
3. అతను తరచుగా ముంతాజ్‌తో కలిసి పనిచేశాడు. వారిద్దరూ 16 సినిమాలు కలిసి చేశాడు.
-దారా సింగ్ అత్యంత ప్రసిద్ధ పాత్రలు:
1. సాంగ్దిల్: దారా సింగ్ 1952లో విడుదలైన ఈ చిత్రంతో హిందీలో అరంగేట్రం చేసాడు. ‘షార్లెట్ బ్రోంటే’ నవల జేన్ ఐర్ ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడింది.
2. హర్ హర్ మహదేవ్: 1974లో చంద్రకాంత్ తీసిన చిత్రంతో దారా సింగ్ పాత్ర మంచి గుర్తింపు పొంది హిందీ చిత్రసీమలో విస్తరించడానికి ఉపయోగపడింది.. దారా సింగ్ ‘భగవాన్ శివుడి’ పాత్రను పోషించడంతో ఈ పౌరాణిక చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. పద్మా ఖన్నా, జయశ్రీ గడ్కర్ కూడా ఈ సినిమాలో నటించారు.
3. అజూబా: 1991లో విడుదలైన అజూబా చిత్రంలో అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా మరియు రిషి కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. మహారాజా కరణ్ సింగ్ పాత్రను దారా సింగ్ పోషించాడు. ఇది మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
4. ఫౌలాద్: దారా సింగ్ -ముంతాజ్ కలిసి పనిచేసిన అనేక చిత్రాలలో ఒకటి. ఇది 1963లో విడుదలైంది. అమర్‌ను దారా సింగ్ చక్కగా చిత్రీకరించాడు. ఇది చాలా ప్రశంసలు అందుకుంది. సినిమాలోని ప్రధాన పాత్ర నిమ్న కులానికి చెందిన వ్యక్తి ఉన్నత కులానికి చెందిన మహిళతో ప్రేమలో పడతాడు.
5.ఇక హిందీలో తీసిన అన్ని పౌరాణిక చిత్రాలు, టీవీల్లో తీసిన రామాయణం, హనుమాన్ పాత్రలను ‘దారాసింగ్’ పోషించాడు. హనుమాన్ పాత్రతోనే దారాసింగ్ కు దేశవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు ఫాలోయింగ్ దక్కింది. ఇప్పటికీ దేశంలో ‘అభినవ హనుమాన్’గా దారాసింగ్ ను కీర్తిస్తారు.
పదేళ్ల క్రితం దారాసింగ్ మరణించారు. నిన్నటికి ఆయన 10వ వర్ధంతి సందర్భంగా సినీ పరిశ్రమ ఆయనకు ఘననివాళులర్పిస్తోంది.