
Daggubati Mohan Babu Passed Away: హీరో వెంకటేష్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన బాబాయ్ మోహన్ బాబు దగ్గుబాటి ఏప్రిల్ 4 మంగళవారం కన్నుమూశారు. బాపట్ల మండలం కారంచేడులో ఈ సంఘటన జరిగింది. మూవీ మొఘల్ రామనాయుడుకి మోహన్ బాబు స్వయానా తమ్ముడు. కొన్నాళ్లుగా మోహన్ బాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు. 73 ఏళ్ల మోహన్ బాబు ఆరోగ్యం విషమించడంతో మరణించారు. ఆయన మరణవార్త కుటుంబ సభ్యులు మీడియాకు తెలియజేశారు. బాబాయ్ మృతి వార్త తెలుసుకున్న దగ్గుబాటి సురేష్ బాబు మంగళవారమే కారంచేడు వెళ్లారు.
షూటింగ్ లో బిజీగా ఉన్న వెంకటేష్ బుధవారం కారంచేడు చేరుకున్నారు. మోహన్ బాబు మృతదేహానికి నివాళులు అర్పించారు. రానా, అభిరామ్ సైతం మోహన్ బాబు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కాగా వెంకటేష్ బాబాయ్ మోహన్ బాబు పాడె మోశారు. రానా కన్నీటి పర్యంతమయ్యారు. మోహన్ బాబు అంత్యక్రియలు వెంకటేష్, సురేష్ బాబు, రానా దగ్గరుండి నిర్వహించారు. మోహన్ బాబు అంతిమయాత్రలో గ్రామస్థులతో పాటు దగ్గుబాటి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వెంకటేష్ పాడె మోయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రామానాయుడు సొంత తమ్ముడైన మోహన్ బాబు గురించి జనాలకు తెలిసింది తక్కువే. ఆయన చిత్ర పరిశ్రమలో రాణించలేదు. రామానాయుడు స్వగ్రామం కారంచేడు. ఆయన పుట్టి పెరిగింది అక్కడే. చెన్నై వెళ్లి రామానాయుడు పెద్ద నిర్మాతగా ఎదిగారు. ఆయన తమ్ముడు మోహన్ బాబు కారంచేడులోనే వ్యవసాయం చేస్తూ ఉండిపోయారు.

వెంకటేష్ తన బిజీ షెడ్యూల్స్ పక్కన పెట్టి బాబాయ్ అంత్యక్రియలకు హాజరయ్యారు. రానా-వెంకటేష్ కలిసి ఇటీవల రానా నాయుడు టైటిల్ తో వెబ్ సిరీస్ చేశారు. ఈ సిరీస్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే నెట్ఫ్లిక్స్ లో రానా నాయుడు దుమ్మురేపింది. ప్రస్తుతం ఆయన సైంధవ్ టైటిల్ తో యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నారు. శైలేష్ కొలను ఈ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. క్రిస్మస్ కానుకగా సైంధవ్ మూవీ విడుదల కానుంది. చాలా గ్యాప్ తర్వాత వెంకటేష్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా సైంధవ్ పలు భాషల్లో విడుదల కానుంది.