
Ravichandran Ashwin- Shikhar Dhawan: క్రికెట్లో ఆటగాళ్ల గొడవలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. బౌలర్, బ్యాటర్ మధ్య ఈ గొడవలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఒక్కోసారి భౌతిక దాడులకు దిగిన సందర్భాల్లో క్రికెట్లో చూసాం. కొన్నిసార్లు సీరియస్ వార్నింగ్ లు కనిపిస్తుంటాయి. తాజాగా అటువంటి వార్నింగ్ తరహా వార్ ఇండియన్ క్రికెటర్లైన రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్ మధ్య నడిచింది. అయితే, ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది అది ఏంటో చూసేద్దాం.
స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ కు చిన్న సైజు వార్నింగ్ ఇచ్చి హాట్ టాపిక్ గా మారాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో భాగంగా పంజాబ్ – రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ బౌలర్ అశ్విన్.. కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ను భయపెట్టాడు. ఎందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవ్వడంతో.. అది హాట్ టాపిక్ గా ఇప్పుడు మారింది.
బాల్ వేయకముందు క్రేజీ దాటుతుండడంతో ఫైర్..
రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టు పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు ఏకంగా 197 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు ప్రబ్ సిమ్రన్ (60), కెప్టెన్ శిఖర్ ధావన్ (86) రెచ్చిపోయి మరి బ్యాటింగ్ చేశారు. అయితే ఏడో ఓవర్ సందర్భంగా అశ్విన్ బౌలింగ్ కు వచ్చాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న ధావన్ .. బాల్ వేయక ముందే పదే పదే క్రీజ్ దాటుతున్నాడు. దీంతో అశ్విన్ అతడిని భయపెట్టాడు. మన్కడింగ్ చేస్తానన్నట్లు వార్నింగ్ ఇచ్చాడు. అదే సమయంలో కెమెరామెన్ బౌండరీ లైన్ దగ్గర బట్లర్ ను చూపించాడు. దీంతో మ్యాచ్ చూస్తున్న వారితో పాటు కామెంటేటర్స్ నవ్వు ఆపుకోలేకపోయారు. ఎందుకంటే మన్కడింగ్ వ్యవహారంలో అశ్విన్ – బట్లర్ మధ్య విడదీయలేని అనుబంధం ఉంది. 2019 ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కు ఆడిన అశ్విన్.. రాజస్థాన్ కు ఆడుతున్న బట్లర్ ను మన్కడింగ్ విధానంలో అవుట్ చేశాడు. క్రికెట్ లో ఈ రూల్ ఉన్నప్పటికీ.. దాన్ని అనైతికంగా భావించేవారు. దీంతో అశ్విన్ – బట్లర్ నాటి ఇన్సిడెంట్ అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఆ రోజు నుంచి మన్కడింగ్ టాపిక్ ఎప్పుడు వచ్చినా సరే అశ్విన్ – బట్లర్ పేర్లు మార్మోగుతూ ఉంటాయి. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కూడా రాజస్థాన్ జట్టుకే ఆడుతుండడం విశేషం.

సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న వీడియో..
ప్రస్తుతం రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్ మధ్య జరిగిన ఈ మన్కడింగ్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వేలాదిమంది నెటిజెన్లు దీని షేర్ చేస్తున్నారు. కింద విభిన్నమైన రూపాల్లో కామెంట్లు పెడుతున్నారు. ఇది జరిగిన సమయంలో వీడియోమాన్ బట్లర్ ను చూపించడం మరింత ఆసక్తికరంగా ఈ వీడియో మారిందని నెటిజన్లు పేర్కొంటూ ఉండడం గమనార్హం.
Ash warning Gabbar and Jos going “I’ve seen this movie before” in his head – it’s all happening at Barsapara 😅
Stream #RRvPBKS LIVE & FREE NOW with #IPLonJioCinema – across all telecom operators 📲#TATAIPL #IPL2023 | @ashwinravi99 @josbuttler pic.twitter.com/M5dChwgARd
— JioCinema (@JioCinema) April 5, 2023