https://oktelugu.com/

Cyber Frauds: సైబర్ నేరగాళ్లకు UIDAI చెక్.. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు సేఫ్..

సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తాజాగా ఆధార్ ఎనెబుల్డ్ ఫేమెంట్ సర్వీసెస్ ద్వారా చెల్లింపులు జరుగుతుండడంతో ఆ వేలిముద్రలను సింథటిక్ ఫింగర్ ప్రింట్స్ ను ఉపయోగించి హ్యాక్ చేస్తున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 16, 2023 / 12:12 PM IST

    Cyber Frauds

    Follow us on

    Cyber Frauds: టెక్నీలజీ ఎంత డెవలప్ అవుతున్నా.. అంతకు మించి సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు ఆకతాయిలు బ్యాంకు అధికారులుగా అమాయక కస్టమర్లకు ఫోన్ చేసి బ్యాంకు ఖాతా నెంబర్, ఓటీపీ నెంబర్లతో డబ్బులు మాయం చేసేవారు. కానీ ఈ వివరాలేమీ లేకుండా.. కేవలం ఆధార్ నెంబర్ తో బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు మాయం చేస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి తన ప్రమేయం లేకుండానే ఆధార్ ఓటీపీ నెంబర్లు వచ్చాయని పోలీసులకు తెలిపాడు. మరో వ్యక్తి తాను ఎవరికీ ఏం వివరాలు చెప్పకున్నా డబ్బలు పోయాయని చెప్పాడు. అయితే ఇలాంటి హ్యాకర్లకు UIDAI చెక్ పెట్టే మార్గం కనుగొంది. అదేంటంటే?

    సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తాజాగా ఆధార్ ఎనెబుల్డ్ ఫేమెంట్ సర్వీసెస్ ద్వారా చెల్లింపులు జరుగుతుండడంతో ఆ వేలిముద్రలను సింథటిక్ ఫింగర్ ప్రింట్స్ ను ఉపయోగించి హ్యాక్ చేస్తున్నారు. ఇటువంటి స్కాంలు గతంలోనే ఆంధ్రప్రదేశ్ లో బయటపడ్డాయి. 2022లో ఆంధ్రప్రదేశ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్ సైట్ ను నుంచి 149 కస్టమర్ల డాటా ఆధారంగా నకిలీ వేలిముద్రలు తయారు చేసి రూ.14 లక్షలను మాయం చేశారు. ఈ విషయం తరువాత వెలుగులోకి రావడంతో పోలీసులు క్లోనింగ్ వేలిముద్రలను స్వాధీనం చేసుకున్నారు.

    తాజాగా హైదరాబాద్ లోని సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన ఫోన్ కు ఆధార్ వేలిముద్రలు తీసుకుంటున్నట్లు ఓటీపీలు పదే పదే వచ్చాయని పేర్కొన్నాడు. తాను ఎవరికీ, ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కానీ ఓటీపీలు వచ్చాయని తెలిపారు. అయితే ఈ విషయం గురించి బ్యాంకుకు వెళ్లి అధికారులను అడగగా తమకు సంబంధం లేదని తెలిపారు. కొన్ని రోజుల తరువాత తన ఖాతాలో డబ్బులు మాయం అయినట్లు ఫిర్యాదు దారుడు పేర్కొన్నాడు. ఓ మహిళకు ఇలాంటి పరిస్థితి రావడంతో ఆమె యూట్యూబ్ ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని తెలిపింది. ఈ నేపథ్యంలో పోలీసులు UIDAI కి సమాచారం అందించగా ఎలాంటి రిప్లై రాలేదు.

    ఆన్లైన్ ద్వారా రాజస్థాన్, జార్ఘండ్ లాంటి ప్రాంతాల్లో సైబర్ నేరగాళ్ల నకిలీ ఫింగర్ ప్రింట్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు కనుక్కొన్నారు. ఈ నేపథ్యంలో UIDAI కొత్త ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకు ఖాతాదారుడి వేలిముద్రలు ఇతరులెవరు ఉపయోగించకుండా UIDAI బయోమెట్రిక్ అథెంటికేషన్ ను లాక్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీనిని UIDAI వెబ్ సైట్లో ఉంచారు. సాధారణ సమయాల్లో దీనికి లాక్ వేసి అవసరమైనప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా హ్యాకర్స్ నుంచి కొంత తప్పించుకునే అవకాశం ఉందని హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.