https://oktelugu.com/

Biryani: రూపాయి బిర్యానీ కోసం రోడ్డెక్కిన జనం

Biryani: బిర్యానీ…ఈ మాట వింటేనే పిల్లల నుంచి పెద్దవారి వరకూ లొట్టలేసుకుంటారు. ఆహార పదార్థాల విభాగంలో బిర్యానీదే అగ్రస్థానం. ఎటువంటి ఫంక్షన్ అయినా బిర్యానీ లేనిదే చేయరంటే అతిశయోక్తి కాదు. కుగ్రామం నుంచి పట్టణాల వరకూ బిర్యానీ షాపులు వెలుస్తున్నాయి. నిరుద్యోగ యువతకు ఇవి ఉపాధిగా నిలుస్తున్నాయి. తొలుత తెలుగునాట బాగా పాపులర్ అయిన బిర్యానీ ఇప్పుడు ఉప ఖండం దాటి.. ఖండంతారాల ఖ్యాతిని సొంతం చేసుకుంది. తెలుగునాట గల్లీ నుంచి పట్టణాల వరకూ బిర్యానీ తయారీ […]

Written By:
  • Dharma
  • , Updated On : April 7, 2023 / 01:43 PM IST
    Follow us on

    Biryani

    Biryani: బిర్యానీ…ఈ మాట వింటేనే పిల్లల నుంచి పెద్దవారి వరకూ లొట్టలేసుకుంటారు. ఆహార పదార్థాల విభాగంలో బిర్యానీదే అగ్రస్థానం. ఎటువంటి ఫంక్షన్ అయినా బిర్యానీ లేనిదే చేయరంటే అతిశయోక్తి కాదు. కుగ్రామం నుంచి పట్టణాల వరకూ బిర్యానీ షాపులు వెలుస్తున్నాయి. నిరుద్యోగ యువతకు ఇవి ఉపాధిగా నిలుస్తున్నాయి. తొలుత తెలుగునాట బాగా పాపులర్ అయిన బిర్యానీ ఇప్పుడు ఉప ఖండం దాటి.. ఖండంతారాల ఖ్యాతిని సొంతం చేసుకుంది. తెలుగునాట గల్లీ నుంచి పట్టణాల వరకూ బిర్యానీ తయారీ కేంద్రాలు వెలుస్తున్నాయి. బిర్యానీ తయారీలో పాపులర్ అయితే కుగ్రామలకు వెళ్లి మరీ కొనుగోలు చేయడం ఇప్పుడు చూస్తున్నాం.

    బిర్యానీ ప్రియుల కోసం ప్రకాశం జిల్లా మర్కాపురంలో ఓ ప్రైవేటు రెస్టారెంట్ వినూత్న ఆఫర్ చేసింది. రూపాయికే బిర్యానీ అందిస్తున్నట్టు ప్రకటన చేసింది. కానీ దీనికి ఒక షరతు పెట్టింది. పాత, పురాతన రూపాయి నోటు తెచ్చిన వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని నిబంధన విధించింది.అయితే పురాతన రూపాయి నోటు ఎవరి దగ్గర ఉంటుంది కదా అన్న ధీమాయో.. లేకుంటే పాపులర్ అవ్వాలన్న ఉద్దేశ్యమో కానీ గురువారం షాపు ప్రారంభించే సమయానికే వందలాది మంది క్యూకట్టారు. చేతిలో పాత రూపాయి నోటు పట్టుకొని షాపు వద్ద పడిగాపులు కాశారు. వీరందరికీ సప్లయ్ చేయలేమని భావించిన యాజమాన్యం బిర్యానీ విక్రయాలను మధ్యాహ్నం వరకూ వాయిదా వేసుకుంది.

    Biryani

    రెస్టారెంట్ ఎదుట పిల్లలు, మహిళలు, వృద్ధులు పడిగాపులు పడడాన్ని స్థానికులు వేడుక అని భ్రమపడ్డారు. తెలుసుకొని రూపాయి నోటుతో రావడం మొదలుపెట్టారు. దీంతో అక్కడ ట్రాఫిక్ రద్దీ నెలకొంది. వాహనాలు సైతం బారులుదీరాయి. దీంతో ఏంచేయాలో తెలియక యాజమాన్యం మల్లగుల్లాలు పడింది. అమ్మకాలు చేయకుండా ఉత్తమమని భావించి మధ్యాహ్నం వరకూ నిలిపివేసింది. దీంతో మార్కాపురం, కంభం రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు వచ్చి క్రమబద్దీకరించాల్సి వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ దృశ్యాలే హల్ చల్ చేస్తున్నాయి. అయితే జనం రద్దీ తగ్గిన తరువాత పరిమిత సంఖ్యలో ఉన్నవారికి బిర్యానీ అందించి నిర్వాహకులు చేతులు దులుపుకున్నారు. ఏదో ఆఫర్ ఇచ్చామని అనిపించుకున్నారు.