Snake Farming: పుర్రెకో బుద్ధి..జిహ్వ కో రుచి అన్నారు పెద్దలు. దీన్ని నిజం చేసి చూపించారు ఈ గ్రామ ప్రజలు. సాధారణంగా మనకు గ్రామం అంటే ఏం గుర్తొస్తుంది.. పంటపొలాలు, కోళ్లు, మేకలు, పశువులు విరివిగా కనిపిస్తాయి. వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం కోసం ప్రజలు వీటిని పెంచుతుంటారు. వీటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని వివిధ మార్గాలకు మళ్లిస్తారు. అయితే మన దేశంలో ఇవన్నీ కూడా కుటీర పరిశ్రమలు గా పేరుపొందాయి. కానీ వీటిని కాకుండా పాములను పెంచితే, వాటి ద్వారా దండిగా ఆదాయం సంపాదిస్తుంటే.. చదువుతుంటే ఇబ్బందిగా ఉంది కదూ. కానీ ఈ గ్రామ ప్రజలు వాటి ఆధారంగానే కోట్లను సంపాదిస్తున్నారు.
సాధారణంగా పాము కనిపిస్తే అల్లంత దూరం పారిపోతాం. ధైర్యం ఉంటే ఒక కర్రతో దానిని చంపేస్తాం. అలా కాకుండా విషాన్ని చిమ్మే పాములను ఇంట్లో పెట్టుకుంటే దాన్ని ఏమనాలి? అది కూడా ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో ఉంటే దాన్ని ఎలా వర్ణించాలి? ఎలాంటి భయం లేకుండా ఈ గ్రామ ప్రజలు పాములను దర్జాగా వారి ఇంట్లో పెంచుకుంటున్నారు. కూడా మాత్రమే కాదు వాటి ద్వారా బీభత్సమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఇంటిల్లిపాది మరో పనికి వెళ్లకుండా కేవలం పాములను సాకే పనిలోనే నిమగ్నమవుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు వేలాది పాములను పోషించుకుంటూ తమ పోషణకు మార్గంగా ఎంచుకుంటున్నారు. ఎటువంటి భయం లేకుండా చేతులతోనే పాములను పట్టుకుంటూ వాటి బాగోగులను చూసుకుంటున్నారు.
చైనాలోని జిస్కియావో అనే ఒక గ్రామం ఉంది. సుమారు 100 ఇళ్ల వరకు ఉండే ఈ గ్రామంలో.. ఇంట్లోనూ పాములు విరివిగా కనిపిస్తాయి. కొన్ని గుడ్ల మీద పొదుగుతుంటే.. మరికొన్ని సయ్యాటలాడుతుంటాయి. అయితే ఈ పాములన్ని కూడా దాదాపు విషపూరితమైనవే. చైనాలో పాముల మాంసాన్ని కూడా తింటారు కాబట్టి ఈ గ్రామ ప్రజలు వాటిని విరివిగా పెంచుతారు. వీటి కోసం ప్రత్యేకమైన షెడ్యూల్ ఏమి వేయకుండా తమ ఇంట్లోనే పెంచుతారు. వాటి కోరల్లోని విషాన్ని సేకరించి ఏటా 4.5 కోట్ల ఆదాయాన్ని అర్జిస్తున్నారు. వాటి మాంసాన్ని విక్రయించి కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్నారు. అయితే ఇలాంటి విషపూరితమైన పాములను పెంచేటప్పుడు వారు చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. లేకుంటే పాములు కాటేసే ప్రమాదం ఉంటుంది.. ఇక ఈ గ్రామాల్లోని పాములను మిగతా ప్రాంతాల వారు ఎంత రేటు ఇచ్చయినా కొనుక్కొని వెళ్తారు. దగ్గర అయితే పశువులు, కోళ్ల పెంపకం కనిపిస్తుంది. చైనా అంటేనే చిత్రమైన ఆహారపు అలవాట్లకు ప్రసిద్ధి కాబట్టి.. అక్కడి ప్రజల ఇష్టాలను తెలుసుకొని ఈ గ్రామ ప్రజలు పాములను పెంచుతున్నారు.. ఐడియా అదిరిపోయింది కదూ!
View this post on Instagram