
Sreemukhi: ఒకప్పుడు అనసూయ, రష్మీ గౌతమ్ డ్రెస్సింగ్ ఎక్కువ ట్రోల్ అయ్యేది. ఈ మధ్య శ్రీముఖి విమర్శల పాలవుతుంది. స్కిన్ షో చేయడంలో వారిద్దరినీ శ్రీముఖి దాటేసింది. బుల్లితెర మీద స్కిన్ షో స్టార్ట్ చేసిన ఘనత అనసూయదే, ఆమెను రష్మీ ఫాలో అయ్యింది. ఈ జబర్దస్త్ యాంకర్స్ బోల్డ్నెస్ కి బ్రాండ్ అంబాసిడర్స్ అయ్యారు. వారిని శ్రీముఖి బీట్ చేసింది. శ్రీముఖి ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ దారుణంగా ఉంటున్నాయి.

ఆమె ఎంతగా స్కిన్ షో చేస్తుందో అంతగా ఆఫర్స్ వస్తున్నాయి. దాదాపు అరడజను షోలు శ్రీముఖి ఖాతాలో ఉన్నాయి. ఇటీవల బీబీ జోడి ముగిసింది. కొత్త షోలకు సైన్ చేస్తున్నారు. టాప్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్న రష్మీ చేతిలో రెండు షోల కంటే ఎక్కువ లేవు. అనసూయ పూర్తిగా యాంకరింగ్ వదిలేశారు. ఇక మెగా యాంకర్ సుమ జోరు తగ్గించారు. ‘సుమ అడ్డా’ టైటిల్ తో ఓ టాక్ షో చేస్తున్నారంతే..
బుల్లితెర మీద శ్రీముఖి ఆధిపత్యం నడుస్తుందని క్లియర్ గా అర్థం అవుతుంది. యాంకరింగ్ లో సమీకరణాలు మారిపోయాయి. గ్లామరస్ యాంకర్స్ దే రాజ్యం. ఈ పరిణామాలు శ్రీముఖి లాంటి బోల్డ్ అండ్ డేరింగ్ అమ్మాయిలకు కలిసొస్తుంది. తాజాగా శ్రీముఖి చీరలో పరువాల ప్రదర్శన చేసింది. ఉల్లిపొరలాంటి చీర కట్టి కొంగు చాటు నుండి నడుము, నాభీ చూపించింది.
చీర కట్టినా కూడా గ్లామర్ యాంగిల్ వదల్లేదు శ్రీముఖి. ఆమె లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. మరోవైపు వెండితెర మీద కూడా ఆమె సత్తా చాటే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. భోళా శంకర్, బాలకృష్ణ 108 చిత్రాల్లో శ్రీముఖి నటిస్తున్నారట. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

ఆల్రెడీ ‘క్రేజీ అంకుల్స్’ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. పలు చిత్రాల్లో చిన్నా చితకా పాత్రలు చేశారు. ఇక పటాస్ షోతో శ్రీముఖి యాంకర్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి పాల్గొన్నారు. ఇది ఆమెకు బాగా కలిసొచ్చింది. సీజన్ 3 రన్నర్ గా నిలిచిన శ్రీముఖి తృటిలో టైటిల్ మిస్ అయ్యారు. రాహుల్ సిప్లిగంజ్ ఈ సీజన్ విన్నర్ అయ్యారు.