
Sreeleela: టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్ శ్రీలీల కి ఉన్న క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పెళ్లి సందడి అనే సినిమాతో ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా ఈమె తొలి సినిమాతోనే తన అందం మరియు అద్భుతమైన నటనతో అశేష ప్రేక్షాభిమానం పొందిన ఈమె,ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ తో ‘ధమాకా’ అనే చిత్రం చేసి మరో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.
ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం శ్రీ లీల వేసిన డ్యాన్స్ స్టెప్పులే అని విమర్శకులు సైతం చెప్పే మాట. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ లో టాప్ లీడింగ్ స్టార్ హీరోలందరి సినిమాల్లో నటిస్తుంది.ఇప్పటికే పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , విజయ్ దేవరకొండ ఇలా టాప్ స్టార్స్ అందరితో నటిస్తున్న శ్రీ లీల, బాలకృష్ణ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది.
ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, శ్రీలీల బాలయ్య కూతురిగా నటిస్తుంది.అయితే ప్రస్తుతం ఆమెకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన సాంగ్ షూటింగ్ ని రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరిస్తున్నారు. సినిమాలో ఒక ఉత్సవం సందర్భంగా వచ్చే ఈ పాట కోసం భారీ గానే ఖర్చు చేస్తున్నారట. కేవలం ఈ ఒక్క పాట కోసమే సుమారుగా 5 కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం.

శ్రీలీల డ్యాన్స్ కి ఆడియన్స్ లో మామూలు క్రేజ్ లేదు, ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ఈమె డ్యాన్స్ చూసేందుకే థియేటర్స్ లోకి అడుగుపెడుతుంటారు.’ధమాకా’ లోని పాటలకు ఈమె వేసిన స్టెప్పులకు థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ మామూలుది కాదు, అందుకే నిర్మాతలు ఈమె ప్రత్యేక సాంగ్ పై ఇంత ఖర్చు చేస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా సాహు గారిపాటి వ్యవహరిస్తున్నాడు.ఖర్చు లో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఆయన క్వాలిటీ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.