Home Loans: ఇల్లు కట్టుకునేవారు లేదా ఇల్లు కొనుక్కునేవారు రుణం తీసుకోకుండా ఉండడం లేదు. ఆదాయం ఉన్నవారితోపాటు ఇప్పటికే డబ్బు ఉన్నవారు సైతం గృహ రుణం ద్వారానే ఇల్లును నిర్మించుకుంటున్నారు. అయితే గతంలో కంటే ఇప్పుడు గృహ రుణంపై వడ్డీ రేట్లు తగ్గుతూ వస్తున్నాయి. ముఖ్యంగా 2025 ఏడాది మొదటి నుంచి గృహ రుణాలపై ఆర్బిఐ కీలక నిర్ణయం తీసుకుంటూ వస్తుంది. దీంతో వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే మూడుసార్లు బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇప్పుడు మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా చేసిన ప్రకటన ప్రకారం 25 బేసిస్ పాయింట్లను తగ్గించినట్లు ఆర్బిఐ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఆర్.బి.ఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఒకవైపు రూపాయి పతనం కొనసాగుతున్నప్పటికీ గృహ రుణం పై వడ్డీ రేట్లు తగ్గించడం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ఆర్బిఐ 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో గృహ, వాహన రుణం తీసుకున్న వారికి ఉపశమనం కలగనుంది. గత ఏడాదిలో తొమ్మిది శాతం వరకు ఉన్న వడ్డీ రేట్లు ఇప్పుడు 7.5% వరకు తగ్గాయి. దీంతో రూ. 50 లక్షల రుణం తీసుకున్న వారికి 125 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు తెలుస్తోంది. వీరికి రూ. 9 లక్షల మేర ఆధార్ అవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ. 50 లక్షల రుణం తీసుకున్నారని అనుకుందాం. ఇతడు రుణం తీసుకున్నప్పుడు 8.50 శాతం వడ్డీ ఉంటే.. 20 సంవత్సరాల కాలానికి నెల నెలా రూ.43,391 ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం శాతానికి రెపోరేట్ తగ్గించారు. నీతో రూ.39,518 ఈఎంఐ తగ్గుతుంది. అంటే దాదాపు నెలకు రూ.4,000 ఈఎంఐ తగ్గుతుంది. ఈ లెక్కన చిన్న మొత్తంలో రుణం తీసుకున్న వారికి సైతం తగ్గింపు జరిగే అవకాశం ఉంటుంది.
2025 ఏడాదిలో ఇప్పటికే మూడుసార్లు రేపో రేటును ఆర్బిఐ తగ్గించింది. వీటిలో మొదటిసారిగా ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు, ఏప్రిల్ లో 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. జూన్ నెలలో మాత్రం ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. తాజాగా మరో 25 బేసిస్ పాయింట్లను తగ్గించి రుణ గ్రహీతలకు మేలు చేసింది. అయితే జిఎస్టి తగ్గింపుతో కొనుగోలు పెరిగాయి. దీంతో 2025 -26 సంవత్సరానికి వృద్ధిరేటు అంచనాలను 6.8 నుంచి 7.3 శాతానికి పెంచుతున్నట్లు ఆర్బిఐ తెలిపింది. ప్రస్తుతం ద్రవ్యల్ బలం కూడా తగ్గుముఖం పట్టిందని, అందువల్ల అంచనాలను 2.6 నుంచి 2 శాతానికి తగ్గిస్తున్నామని తెలిపింది.