Homeజాతీయ వార్తలుElection Results 2023: ఈశాన్యంలో కమల వికాసం.. పట్టు నిలుపుకున్న బీజేపీ

Election Results 2023: ఈశాన్యంలో కమల వికాసం.. పట్టు నిలుపుకున్న బీజేపీ

Election Results 2023
Election Results 2023

Election Results 2023: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల్లోల బీజేపీ మళ్లీ వికసించింది. ఎగ్జిట్‌పోల్‌ అంచనాల మేరకే ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందని, ఒక రాష్ట్రంలో హంగ్‌ ఏర్పడవచ్చని అంచనా వేశారు. ఈ మేరకే నాగాలాండ్, త్రిపురలో భాజపా హవా కొనసాగుతోంది. మేఘాలయలో సంకీర్ణ ప్రభుత్వంఏర్పడే అవకాశం ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస మెజార్టీ 31 సీట్లు.

నాగాలాండ్, త్రిపురలో కాషాయం రెపరెపలు..
ఈశాన్య రాష్ట్రాల్లో మళ్లీ కాషాయ జెండా రెపరెపలాడేలాగే కన్పిస్తోంది. త్రిపుర, నాగాలాండ్‌లో భాజపా ఆధిక్యంలో కొనసాగుతోంది.

– త్రిపురలో బీజేపీ కూటమి 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్‌ – వామపక్షాల కూటమి 19 చోట్ల ముందంజలో ఉంది. టీఎంపీ(తిప్రా మోథ్రా పార్టీ) 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

Election Results 2023
Election Results 2023

– నాగాలాండ్‌లో భాజేపీ–ఎన్‌డీపీపీ కూటమి స్పష్టమైన ఆధిక్యం సంపాదించింది. ఇప్పటి వరకు ఈ కూటమి ఒక చోట విజయం సాధించగా.. మరో 48 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్‌ పీఎఫ్‌ 6, కాంగ్రెస్‌ 1, ఎన్‌పీపీ 3, ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు.

– ఇక మేఘాలయలో ఇప్పటి వరకు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. ఇక్కడ సీఎం కాన్రాడ్‌ సంగ్మా సారథ్యంలోని ఎన్‌పీపీ 15, తృణమూల్‌ కాంగ్రెస్‌ 15 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఇతరులు 16 స్థానాల్లో, భాజపా 6, కాంగ్రెస్‌ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular