https://oktelugu.com/

Corporate Educational Institutions : చై.. నా.. అరాచకం.. అడ్మిషన్ల కోసం టీచర్లకు టార్చర్‌! 

చైతన్య నారాయణ పాఠశాలలతోపాటు అన్ని కార్పొరేట్‌ ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలు మచ్చుకైనా అమలు కావడం లేదు. నిబంధనలను అమలు చేయాల్సిన విద్య శాఖ అధికారులు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు.

Written By: , Updated On : June 15, 2023 / 03:27 PM IST
Follow us on

Corporate Educational Institutions : తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ కార్పొరేట్‌ విద్యాసంస్థలు చైతన్య, నారాయణ అరాచకాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. వివిధ కోర్సుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులు నుంచి ఫీజులు వసూలు చేస్తున్న ఆయా విద్యాసంస్థలు తర్వాత పిల్లలను చదువుల పేరుతో టార్చర్‌ చేస్తున్నారు. దీనిని తట్టుకోలేక ఎంతోమంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు కూడా. ఇక ఈ చై… నా.. అరాచకాల్లో తాజాగా మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు అడ్మిషన్ల కోసం ఇప్పుడు టీచర్లను వేధిస్తున్నాయి. మెంటల్‌ టార్చర్‌ చేస్తున్నాయి.

దోచుకోవడం ఒక ఎత్తు.. 
రూ వేలకు వేలు ఫీజులు, డొనేషన్లు, నోట్‌ బుక్స్‌ యూనిఫామ్‌ పేరుతో దోచుకోవటం ఒక ఎత్తయితే తాజాగా అడ్మిషన్లు చేర్పించాలంటూ పాఠశాలలో టీచర్లపై వేధింపులకు పాల్పడుతున్నారు. అడ్మిషన్లు చేయకపోతే ఏకంగా నెలవారీ వేతనాలు నిలిపివేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలోని పాఠశాలలో అడ్మిషన్లు చేయలేదని టీచర్‌ ఉషారాణి జీతం నిలిపివేశారు. పాఠశాలలో టీచర్‌గా చేరే సమయంలో అడ్మిషన్లు చేస్తేనే జీతం ఇస్తామని చెప్పలేదని ఇప్పుడు అడ్మిషన్లు చేర్పించలేదని జీతం ఇవ్వకుండా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
అధికారుల మౌనం..  
చైతన్య నారాయణ పాఠశాలలతోపాటు అన్ని కార్పొరేట్‌ ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలు మచ్చుకైనా అమలు కావడం లేదు. నిబంధనలను అమలు చేయాల్సిన విద్య శాఖ అధికారులు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. మంగళగిరిలో ఎంఈఓ ఉన్నప్పటికీ చర్యలు తీసుకునే అధికారం తనకు లేదంటూ దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. పాఠశాలల ఇష్టారాజ్య వైఖరి వల్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఏమాత్రం తనిఖీలు చేయకపోవడం ఒకవేళ తనిఖీల్లో లోపాలు బహిర్గతం అయినా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
నోట్‌ బుక్స్‌.. యూనిఫామ్‌ కోసం ప్రత్యేక స్టాళ్లు
కార్పొరేట్, ప్రైవేట్‌ పాఠశాలల్లో నోట్‌ బుక్స్‌ యూనిఫామ్స్‌ విక్రయించొద్దనే నిబంధన ఉంది. కానీ ఆ నిబంధనతో పని లేకుండా నోట్, బుక్స్‌ యూనిఫామ్‌కు స్కూల్‌ ఫీజుతో పాటుగా వేలల్లో వసూలు చేసి మరీ విక్రయిస్తున్నారు. ఎల్‌కేజీ నోట్‌ బుక్స్‌కు రూ.2 వేల నుంచి రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. ఉన్నతాధికారులు తనిఖీకి వచ్చిన సందర్భంలో తమకు ఇబ్బంది కలగకుండా తప్పించుకోవాలనే ఉద్దేశంతో పలు కార్పొరేట్‌ పాఠశాలల సమీపంలో ప్రత్యేక దుకాణాలను తీసుకొని అక్కడ స్టాళ్లు పెట్టి మరీ విక్రయిస్తున్నారు. సొంత సిలబస్‌ ముద్రించి మరి పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.