
చైనాలో పుట్టిన కరోనా మహమ్మరి ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబెలేత్తిస్తుంది. దేశంలోనూ కరోనా కేసులు రోజుకు రోజుకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవగాహన కల్పిస్తున్నాయి. దీంతోపాటు పలువురు సెలబ్రెటీలు తమవంతుగా సోషల్ మీడియాలో కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. కరోనా నివారణకు తీసుకోవాలని జాగ్రత్తలను సూచిస్తున్నారు. మరికొందరు పాటల రూపంలో కరోనాపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
తాజాగా ‘గబ్బర్ సింగ్’ కామెడియన్స్ కరోనాపై అవగాహన కల్పించేలా ఓ ర్యాపో సాంగ్ విడుదల చేశారు. ‘వీ ఆర్ ఇండియన్స్’ అనే సాంగ్‌ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ట్వీటర్లో పోస్టు చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, కమెడియన్స్, గీత రచయిత, ఈ పాటకు పని చేసిన ప్రతీఒక్కరిని ఆయన అభినందించారు. ఇందులో గబ్బర్ సింగ్ కామెడీయన్స్ సాయి బాబా, రమేష్, ప్రవీణ్, రాజశేఖర్, శంకర్, శ్రీకాంత్, ఉదయ్ కుమార్, సోమరాజ్, చంద్రశేఖర్, నరసింహ రెడ్డి తదితరులు నటించారు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.