Homeట్రెండింగ్ న్యూస్Telangana Cabinet : రేవంత్‌ కేబినెట్‌లో ముగ్గురికి ఉద్వాసన.. అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌?

Telangana Cabinet : రేవంత్‌ కేబినెట్‌లో ముగ్గురికి ఉద్వాసన.. అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌?

Telangana Cabinet :  తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తయింది. కీలక శాఖలకు మంత్రులు(Minister’s)లేకుండానే పాలన సాగింది. 18 మంత్రి పదవులకు గాను, ప్రస్తుతం 12 పదవులే భర్తీ అయ్యాయి. మరో ఆరు శాఖలు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన హోం(Home), విద్య(Education)శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కేబినెట్‌ విస్తరణ కోసం సీఎం, డిప్యూటీ సీఎం పలుమార్లు అధిష్టానం అనుమతి కోరారు. అయితే రేపు, మాపు అంటూ వాయిదా వేసుకుంటూనే వచ్చాయి. ఇక ఏడాది పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy)ఇటీవల సర్వే చేయించారు. ఈ సర్వేలో 10 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులపై వ్యతిరేకత వ్యక్తమైనట్లు గుర్తించారు. ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి ఢిల్లీ వెళ్లిన సీఎం ఈ నివేదికను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర క్యాబినెట్‌లో ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికేందుకు అధిష్టానం రేంత్‌రెడ్డికి అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఏడాది పాలనలో రేవంత్‌ సర్కార్‌పై ఎక్కువగా విమర్శలు, వివాదాలు రావడానికి ఆ ముగ్గురు మంత్రులే కారణమని తెలుస్తోంది. ఆ ముగ్గురి పనితీరు కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నట్లు సీఎం రేంవంత్‌రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారు. అందుకే త్వరలో చేపట్టబోయే కేబినెట్‌ విస్తరణలో ముగ్గురిని తప్పించేందుకు అనుమతి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు తెలిసింది.

శాఖలపై రాని పట్టు…
ఇక కేబినెట్‌ నుంచి తప్పించాలనుకుంటున్న ముగ్గురు మంత్రులకు ఇప్పటి వరకు తమ శాఖలపై పట్టు సాధించలేదని తెలుస్తోంది. ఇతర విషయాల్లో జోక్యం చేసుకుంటూ అనసవర వివాదాలకు కారణం అవుతున్నారట. అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో వారిని తప్పించడం ఖాయమైందని తెలుస్తోంది. వేటు పడే మంత్రుల్లో కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ ముగ్గురిని తొలగించడం వలన పార్టీకి ఏమైనా ఇబ్బందులు వస్తాయా.. కేడర్‌ ఏమైనా వ్యతిరేకించే అవకాశం ఉందా అనే విషయాలపై ఇప్పటికే సీఎం రేవంత్‌ సర్వే నిర్వహించినట్లు తెలిసింది. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నవారిని తొలగించడమే మంచిది అన్న అభిప్రాయం కేడర్‌లోనూ వ్యక్తమైనట్లు సమాచారం.

ఆమెతో అన్నీ వివాదాలే..
కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పద మంత్రిగా కొండా సురేఖ(Konda Surekha) పేరు తెచ్చుకున్నారు. మొదటి నుంచి ఆమె వ్యవహారశైలి దురుసుగానే ఉంది. ఇక విపక్ష నేతలపై ఆమె చేస్తున్న విమర్శలు, సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన విమర్శలు, కేటీఆర్‌పై చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. ప్రజల్లో కూడా ఆమెపై తీవ్ర త్యతిరేకత ఉందని తెలిసింది. ఇక ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయాల్లో కూడా కొండా సురేఖ అతిజోక్యం కారణంగా ఎమ్మెల్యేలు, నాయకులు ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. వరంగల్‌ జిల్లాలో పార్టీలో వర్గపోరు మొదలైంది. మెదక్‌ జిల్లా ఇన్‌చార్జిగా కూడా వివాదాలకు కారణమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు పెద్దగా కృషి చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను తప్పించాలన్న నిర్ణయానికి సీఎం రేవంత్‌రెడ్డి వచ్చారట.

పట్టు సాధించని జూపల్లి..
ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరిన మరో సీనియర్‌ నేత జూపల్లి కృష్ణారావు(Jepalli Krishna Rao). సీనియర్‌ ఎమ్మెల్యే హోదాలో ఆయనకు మంత్రిపదవి దక్కింది. కానీ, ఆయన ఆశించిన మేరకు పని చేయడం లేదన్న టాక్‌ వినిపిస్తోంది. ఏడాదిగా తన శాఖపై పట్టు సాధించలేకపోయార్న విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఎమ్మెల్యేలతో కూడా జూపల్లి సమన్వయం చేసుకోలేకపోతున్నారట. ఆయన వైఖరిపై జిల్లా నాయకులు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఇటీవల యూబీ గ్రూప్‌ తెలంగాణ నుంచి కింగ్‌ ఫిషర్‌ బీర్లను ఉపసంహరించుకున్న వ్యవహారాన్ని సరిగా డీల్‌ చేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారట.

తుమ్మల కూడా…
ఇక ఖమ్మం జిల్లా నుంచి సీనియర్‌ నేత హోదాలో మంత్రి పదవి దక్కించుకున్న మరో నేత తుమ్మల నాగేశ్వర్‌రావు(Tummala Nageshwar Rao). ఆయనకు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం చాలా ఉంది. కానీ, ప్రస్తుతం తన శాఖపై పట్టు సాధించలేదన్న విమర్శలు ఉన్నాయి. తరచూ వివాదాలకు కారణమవుతున్నారు. జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయడం లేదు. ఖమ్మం జిల్లా నుంచి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావుకు మంత్రి పదవులు దక్కాయి. ఒకే జిల్లా నుంచి ముగ్గురికి పదవులు రావడం కూడా ఆయనను తప్పించడానికి కారణంగా తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular