Viral Video : Instagram లో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో ప్రకారం.. ఓ అత్తపై కోడలు నల్లటి ముసుగు వేసింది. వెంటనే ఆమెపై ఏకపక్షంగా దాడి చేసింది. పిచ్చిపిచ్చిగా కొట్టింది. ఆమె కొట్టిన దెబ్బలకు ఆ అత్త తీవ్రంగా విలపించింది. వెంటనే తేరుకున్న అ కోడలు అత్తపై ముసుగు తీసేసి కింద పడిపోయింది.. తనని కూడా ఎవరో కొట్టినట్టు కేకలు వేసింది. దీంతో అత్త ముందుగా తన కోడలపై ఎవరో ఆగంతకుడు (unknown person) దాడి చేసినట్టు.. ఆ తర్వాత తనను కొట్టినట్టు భావించింది. తనని కొట్టిన దెబ్బలను పక్కనపెట్టి.. తన కోడలిని పరామర్శించడం మొదలుపెట్టింది. దీంతో ఆ కోడలు తనలో తానే నవ్వుకుంది. తన అత్త అమాయకత్వాన్ని చూసి జాలిపడింది.
రచ్చ రచ్చ చేస్తున్న వీడియో
సోషల్ మీడియాలో ఈ వీడియో రచ్చ రచ్చ చేస్తోంది. అత్తా కోడళ్ళకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సూపర్ హిట్ అవడం తొలిసారి కాకపోయినప్పటికీ.. ఈ వీడియోలో నటించిన అత్త కోడళ్ళ పాత్రధారులిద్దరూ పోటాపోటీగా నటించారు.. అత్త పాత్రధారి టీవీ చూస్తుండగా.. కోడలు పాత్రధారి ఆమె తలమీద ముసుగు కప్పుతుంది. వెంటనే తన ప్రతీకారం మొత్తం తీర్చుకునే విధంగా కొడుతుంది. దీంతో ఆమె కింద పడిపోతుంది.. ఆ తర్వాత తేరుకున్న అత్త పాత్రధారి.. కోడలు కిందపడి ఏడుస్తుంటే చూసి తట్టుకోలేక.. ఆమె కూడా ఏడుస్తుంది. తనకు గాయాలైన సంగతిని పక్కనపెట్టి కోడల్ని ఓదార్చడం హృదయాలను చెమ్మగిల్లేలా చేస్తుంది. ప్రతీకారం, ఈర్ష్య, అసూయతో రగిలిపోయే పాత్రలో కోడలు కనిపించగా.. అమాయకత్వం, మూర్తిభవించిన సంప్రదాయానికి ప్రతీకగా అత్త కనిపించింది. మొత్తానికి వారిద్దరు అత్త కోడళ్ళ ఫైట్ రీల్ ను తర్వాత స్థాయికి తీసుకెళ్లారు. అందువల్లే ఇది సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. అంతేకాదు మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. “ఇది చూడ్డానికి కామెడీ లాగానే అనిపిస్తోంది. చూస్తున్నంత సేపు సీరియల్ గుర్తుకొస్తోంది. కానీ ఇలాంటి సన్నివేశాలు ఇప్పుడు నిజ జీవితంలో కూడా చోటుచేసుకుంటున్నాయి. అవే నేటి వైచిత్రికి కారణమవుతున్నాయి. ఇంతకంటే ఏం చెప్పలేం గానీ.. కాకపోతే ఇలాంటి సన్నివేశాలను రీల్స్ రూపంలో చేయకపోవడమే మంచిది. ఎందుకంటే అత్త కోడలు అంటే అన్యోన్యంగా ఉండాలి. అంతే తప్ప ఇలా కొట్టుకుంటే సభ్య సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుంది. ఎందుకైనా మంచిది ఇటువంటి వీడియోలపై సోషల్ మీడియా యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకోవాలి.. సమాజంలో ఇటువంటి వీడియోలు విచ్చిన్నానికి కారణం అవుతాయి.. అందువల్ల ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
View this post on Instagram