
Juneja Brothers: సెక్స్ సమస్యలు రాకుండా కండోమ్స్ రక్షణగా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. అవాంచిత గర్భంతో పాటు అప్పుడే పిల్లలు వద్దనుకునేవారు సైతం దీనిని వాడేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇటీవల కండోమ్స్ వాడడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చాలా మంది అంటున్నారు. అయినా కండోమ్ కు మించిన రక్షణ కవచం మరొకటి లేదని దీని కోనుగోలుకే ఆసక్తి చూపుతున్నారు. గత ఏప్రిల్ లో ఓ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కండోమ్ వాడకంలో భారతదేశం రెండో స్థానంలో ఉందని తెలిపింది. అలాగే 2026 నాటికి దేశంలో కండోమ్ మార్కెట్ విలువ 134 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపారు. అయితే కండోమ్ వ్యాపారంలో ఇప్పటికే ఇద్దరు సోదరులు అత్యున్నతస్థాయికి ఎదిగారు. రూ.50 లక్షలతో ప్రారంభించిన వారి వ్యాపారం రూ.43,264 వేల కోట్ల వరకు పెరిగింది. అంతేకాకుండా త్వరలో వీరి కంపెనీ త్వరలో ఇండియన్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లో లిస్ట్ కానుంది. మరి ఆ కంపెనీ విశేషాలేంటంటే?
రమేష్ సీ జునేజా, రాజీవ్ జునేజా అనే ఇద్దరు సోదరులు రూ.50 లక్షలతో కలిసి ‘మేన్ కైండ్’ అనే ఫార్మా కంపెనీని ప్రారంభించారు. 1995లో అప్పటి పరిస్థితుల ఆధారంగా సెల్స్ మెన్ ల ఆధారంగా నిర్వహించారు. ముందుగా 25 మంది ప్రతినిధులను తీసుకొని వారి ద్వారా కండోమ్స్ ను మార్కెట్లోకి పరిచయం చేశారు. అయితే వీరు అంతటితో ఆగలేదు. తమ కంపెనీని మరింత ఉన్నతస్థాయికి తీసుకురావాలని ఆలోచించారు. దీంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో ప్రచారం చేయించారు. ఇక అప్పటి నుంచి ‘మేన్ కైండ్’ బ్రాండ్ మారుమోగింది. మార్కెట్లో ‘మేన్ కైండ్’ వస్తున్న ఆదరణతో పాటు వినియోగదారులకు అనుగుణంగా ఉత్పత్తులను పెంచారు.
అయితే వ్యాపారంలోని మెళకువలతో , కార్పొరేట్ సెక్టార్లకు అనుగుణంగా విక్రయాలు జరిపారు. ఆ తరువాత ‘మేన్ కైండ్’ పెద్ద కంపెనీల సరసన చేరింది. 2022 పోర్బ్స్ ప్రకారం రమేష్ సీ జునేజా, రాజీవ్ జునేజా నికరలాభం రూ.34,500 కోట్లు. దేశీయంగా అతిపెద్ద కంపెనీల్లో 4వ స్థానానికి చేరిన ‘మేన్ కైండ్’ బ్రాండ్ దేశీయంగా 25 కేంద్రాల్లో ఉత్పత్తి అవుతోంది. ఈ కేంద్రాల్లో మొత్తం 600 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు.

దీంతో ‘మేన్ కైండ్’ పబ్లిక్ సెక్టార్లలో అడుగుపెట్టబోతుంది. రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టర్ ద్వారా 40,058, 844 ఈక్వీటీ షేర్లను స్టాక్ ఎక్చేంజ్ లల్లో జాబితా చేయాలని చూస్తోంది. ఈ మేరకు ఏప్రిల్ 25న ఐపీవోను ప్రారంభించనుంది. మే 3న కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు కేటాయించి మే 8న స్టాక్ ఎక్చేంజ్ లల్లో లిస్టు కానున్నాయి. ఒక్కో షేరును రూ. 1,026 నుంచి రూ.1,080 గా నిర్ణయించారు. వీటికి ప్రమోటర్లుగా ‘మేన్ కైండ్’ రమేష్ సీ జునేజా, రాజీవ్ జునేజాలతో పాటు సీఈవోశీతల్ అరోరా ఉండనున్నారు.