Wife Victims : రోడ్డెక్కిన భార్యా బాధితులు.. ఏం చేశారో తెలుసా?

wife victims : సాధారణంగా భర్త బాధితుల సంఘం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం భార్యా బాధితుల సంఘం ఉండటం గమనార్హం. భార్యల పోరు పడలేక కొందరు భార్యా బాధితుల సంఘం పేర ఓ సంఘం పెట్టుకున్నారు. భార్యల తీరుతో విసిగిపోయిన వారు తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. వారి ఆగడాలు తట్టుకోలేకపోతున్నామని వాపోతున్నారు. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌంేషన్ పేరుతో సంఘం ఏర్పాటు చేసుకున్నారు. భార్యల బాధలతో తట్టుకోలేకపోతున్నారు. వారితో సంసారం చేయడానికి జంకుతున్నారు. ఇదంతా […]

Written By: NARESH, Updated On : February 26, 2023 7:25 pm
Follow us on

wife victims : సాధారణంగా భర్త బాధితుల సంఘం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం భార్యా బాధితుల సంఘం ఉండటం గమనార్హం. భార్యల పోరు పడలేక కొందరు భార్యా బాధితుల సంఘం పేర ఓ సంఘం పెట్టుకున్నారు. భార్యల తీరుతో విసిగిపోయిన వారు తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. వారి ఆగడాలు తట్టుకోలేకపోతున్నామని వాపోతున్నారు. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌంేషన్ పేరుతో సంఘం ఏర్పాటు చేసుకున్నారు. భార్యల బాధలతో తట్టుకోలేకపోతున్నారు. వారితో సంసారం చేయడానికి జంకుతున్నారు. ఇదంతా వారికి ఇచ్చిన హక్కులేనని చెబుతున్నారు.

చట్టంలోని లొసుగులను..

భార్యలకు గృహహింస, వరకట్నం, వేధింపులు వంటి చట్టాలు ఉండటం వల్ల భర్తలను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులను సైతం భయపెడుతున్నారు. దీంతో భర్తలు తాళలేకపోతున్నారు. చట్టంలోని లొసుగులను అడ్డు పెట్టుకుని తమను సాధిస్తున్నారని చెబుతున్నారు. వారు పెట్టే బాధల నుంచి తమకు విముక్తి కల్పించాలని ఆదివారం సాయంత్రం వరకు దీక్ష కొనసాగిస్తామని సంఘం నేతలు వెల్లడిస్తున్నారు. ఆడవారికి అండగా నిలిచే చట్టాల వల్ల తమ బతుకు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విదేశాల్లో ఉంటున్న బంధువులను..

కొందరు మహిళలు విదేశాల్లో ఉంటున్న భర్త తరఫు బంధువులను సైతం వేధిస్తున్నారు. దీంతో ఎన్ఆర్ఐలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళల అనేక కష్టాలు పడుతున్నామని తెలిపారు. భార్యల తీరుతో వేగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు భార్యల నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. భార్యా బాధితుల సంఘం పేరుతో వారు నిరాహార దీక్ష వరకు వెళ్లారంటే వారిని ఎంత వేధింపులకు గురిచేస్తున్నారో అర్థమవుతోంది.

భార్యల నుంచి రక్షణ

భార్యల నుంచి రక్షణ కల్పించాలని వారు ఆందోళన చేశారంటే వారి బాధలు ఎంతలా ఉన్నాయో అర్థమవుతుంది. ఇలా భర్తలే భార్యల నుంచి రక్షణ కోరడం గమనార్హం. ఈ నేపథ్యంలో భార్యల వేధింపులతో వేగలేకనే వారు రోడ్డెక్కారు. దీనిపై చట్టం ఏం చర్యలు తీసుకుంటుందోనని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందోననే విషయం అందరికి ఆలోచన వస్తోంది కదూ. ఎక్కడో కాదు మన బెంగుళూరులోనే జరిగింది. శనివారం భార్యా బాధితుల సంఘం సభ్యులందరూ తమను కాపాడాలని దీక్షకు పూనుకోవడం సంచలనం కలిగిస్తోంది.