https://oktelugu.com/

Nani Dasara Movie: కెజిఫ్, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలతో దసరాకు పోలికా… వివరణ ఇచ్చిన హీరో నాని!

Nani Dasara Movie: నాని లేటెస్ట్ మూవీ దసరా మార్చి 30న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దసరా మూవీ నుండి సెకండ్ సింగిల్ విడుదల చేశారు. ఈ సాంగ్ రిలీజ్ సందర్భంగా నాని మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ గతంలో నాని చేసిన కామెంట్స్ గుర్తు చేస్తూ… మీరు దసరా సినిమాను ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ వంటి భారీ ఎపిక్ బ్లాక్ బస్టర్స్ తో […]

Written By:
  • Shiva
  • , Updated On : February 14, 2023 / 10:30 AM IST
    Follow us on

    Nani Dasara Movie

    Nani Dasara Movie: నాని లేటెస్ట్ మూవీ దసరా మార్చి 30న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దసరా మూవీ నుండి సెకండ్ సింగిల్ విడుదల చేశారు. ఈ సాంగ్ రిలీజ్ సందర్భంగా నాని మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ గతంలో నాని చేసిన కామెంట్స్ గుర్తు చేస్తూ… మీరు దసరా సినిమాను ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ వంటి భారీ ఎపిక్ బ్లాక్ బస్టర్స్ తో పోల్చారు. దీనికి మీ వివరణ ఏమిటని అడిగారు. రిపోర్టర్ ప్రశ్నకు నాని సుధీర్ఘ వివరణ ఇచ్చారు.

    Also Read: Jagapathi Babu: రెండో అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దన్నాను… జగపతిబాబు షాకింగ్ కామెంట్స్

    టీజర్ విడుదల తర్వాత దసరా సినిమాకు అనేక పోలికలు వచ్చాయి. పుష్ప మూవీలా ఉందంటూ కొందరు కామెంట్స్ చేశారు. నేను ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ చిత్రాలతో దసరాను పోల్చింది ఆ చిత్రాల్లో పోలిన సన్నివేశాలు ఉంటాయనో, వాటిలా రూ. 500 కోట్లు, రూ. 1000 కోట్లు వసూలు చేస్తుందనో అర్థంలో కాదు. ప్రతి ఏడాది కొన్ని ఇండస్ట్రీ గర్వించే చిత్రాలు విడుదలవుతూ ఉంటాయి.

    గత ఏడాది టాలీవుడ్ నుండి ఆర్ ఆర్ ఆర్, కన్నడ పరిశ్రమ నుండి కెజిఎఫ్ 2 విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు మా పరిశ్రమకు చెందినవని గొప్పగా చెప్పుకున్నారు. అలాగే దసరా ఈ ఏడాదికి టాలీవుడ్ లో తెరకెక్కిన ఒక మంచి చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. ఆ అభిప్రాయంలో నేను దసరా కూడా ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ ల మాదిరి గర్వించే సినిమా అవుతుంది అన్నాను. మార్చి 30 వరకు నేను ఇదే అభిప్రాయం మీద ఉంటాను. మూవీ చూశాక నా అభిప్రాయం తప్పో ఒప్పో మీరే చెప్పండి… అని నాని అన్నారు.

    Nani Dasara Movie

    దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. నాని కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నాని కమర్షియల్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన శ్యామ్ సింగరాయ్ మాత్రమే బ్రేక్ ఈవెన్ అందుకుంది. లాస్ట్ రిలీజ్ అంటే సుందరానికీ ఊహించని పరాజయం అందుకుంది. దీంతో దసరా సక్సెస్ పై చాలా ఆశలే పెట్టుకున్నాడు.

    Also Read:Balakrishna- Tarakaratna: తారకరత్న కోసం క్రేజీ ప్రాజెక్ట్ ని ఆపేసిన బాలయ్య..నిరాశలో ఫ్యాన్స్

    Tags