spot_img
Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 Tollywood heroes support: 'ధురంధర్ 2' కి బ్రహ్మరథం పట్టిన టాలీవుడ్ హీరోలు.....

Dhurandhar 2 Tollywood heroes support: ‘ధురంధర్ 2’ కి బ్రహ్మరథం పట్టిన టాలీవుడ్ హీరోలు.. పట్టించుకోని బాలీవుడ్ హీరోలు!

Dhurandhar 2 Tollywood heroes support: మన టాలీవుడ్ ఆడియన్స్ ని మాత్రమే కాదు. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ప్రస్తుతం ‘ధురంధర్ 2 ‘(Dhurandhar 2 Movie) మేనియా లో మునిగి తెలుస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి వారు ట్విట్టర్ లో ఈ చిత్రాన్ని చూసి పొగడ్తలతో ముంచి ఎత్తుతూ ట్వీట్స్ వేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అందరికీ కలిపి మూవీ టీం స్పెషల్ ప్రీమియర్ షోస్ వేసిందో ఏమో తెలియదు కానీ, సూపర్ స్టార్స్ నుండి మీడియం రేంజ్ హీరోల వరకు , అందరూ ఒకే సమయం లో స్పందిస్తూ ట్వీట్స్ వేయడం గమనార్హం. ఒకపక్క టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ చిత్రానికి ఈ రేంజ్ లో బ్రహ్మరథం పడుతుంటే, బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం అసలు పట్టించుకోవడం లేదు.

సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ , షారుక్ ఖాన్ తరహా సెలబ్రిటీలు ఎలాగో ఈ చిత్రం పై స్పందించలేదు. కనీసం మీడియం రేంజ్ సెలబ్రిటీలు కూడా ఈ చిత్రం పై స్పందించలేదు. దీనిపై ఈ చిత్ర అభిమానులు తీవ్రమైన అసంతృప్తి ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో గా నటించిన రణవీర్ సింగ్ ని చూసి, అందరిలో అభద్రతా భావం పెరిగినట్టుగా అన్పిస్తోంది. అందుకే ఒక్కరు కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదు. కనీసం రణవీర్ సింగ్ వయస్సు తో సమానంగా ఉన్నటువంటి షాహిద్ కపూర్ వంటి హీరోలు కూడా ఈ చిత్రాన్ని పట్టించుకోవడం లేదు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. సాధారణంగా ఇలాంటి దేశభక్తి సినిమాలకు సౌత్ ఇండియా కంటే ఎక్కువగా నార్త్ ఇండియా నుండే అద్భుతమైన రెస్పాన్స్ రావాలి. అక్కడి ఆడియన్స్ నుండి అయితే ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు కానీ, సెలెబెరిటీలే మౌనం గా ఉంటున్నారు.

కనీసం రాబోయే రోజుల్లో అయినా వీళ్ళు స్పందిస్తారో లేదో చూడాలి. ఒకవేళ స్పందించకపోతే కచ్చితంగా రణవీర్ సింగ్ పై కచ్చితంగా బాలీవుడ్ హీరోలంతా అభద్రతా భావం తో ఉన్నారని ఖరారు చేసుకోవచ్చు. పార్ట్ 2 సంగతి పక్కన పెడితే , మొదటి భాగం ఆ రేంజ్ బాక్స్ ఆఫీస్ సునామీ ని సృష్టించినప్పటికీ కూడా బాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కరు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. పైగా కొంతమంది హీరోలు తమ పీఆర్ టీం తో ఈ చిత్రం పై ఉద్దేశపూర్వకంగా నెగెటివ్ కామెంట్స్ చేయించారు. సొంత ఇండస్ట్రీ లో ఇలాంటి పరిస్థితి ఎదురు అవ్వడం దురదృష్టకరం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version