
Actress Sana: చక్కని రూపం సనా బేగం సొంతం. ఆమె హీరోయిన్ ఎందుకు కాలేకపోయారనే సందేహం రాక మానదు. కాగా తాను ఎందుకు హీరోయిన్ కాలేదో ఆమె స్వయంగా వెల్లడించారు. వ్యక్తిగతంగా తనకు ఎదురైన ఇబ్బందులను అభిమానులతో పంచుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో సనా మాట్లాడుతూ… మోడల్ గా నా కెరీర్ మొదలైంది. మొదట్లో కొన్ని యాడ్ షూట్స్ లో నటించాను. అత్తింటివారు నాకు సప్పోర్ట్ చేశారు. అయితే ఇతరులు విమర్శించేవారు. మీ కోడలు బురఖా ఎందుకు వేసుకోదు. ఆమె ఏం చేస్తుందని ఆరాలు తీసేవారు.
నాకు హీరోయిన్ ఆఫర్స్ కూడా వచ్చాయి. అయితే పెళ్ళైన విషయం చెప్పకు అనేవారు. స్విమ్ సూట్ వేయాల్సి ఉంటుంది. ఎక్స్పోజింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఆ కండీషన్స్ నాకు నచ్చలేదు. ఆ కారణంగా హీరోయిన్ ఛాన్స్ వదులుకున్నాను. కన్నడ పరిశ్రమలో ఇతర భాషా నటులను అంతగా తీసుకోరు. ఓ దర్శకుడు నాతో భారీ డైలాగ్స్ చెప్పించారు. నేను కష్టపడి చెబుతున్నా వన్స్ మోర్ అంటూ ఇబ్బంది పెట్టారు. వాళ్లు ఆఫర్ ఇస్తేనే వచ్చాను. అలాంటప్పుడు నా మీద ఎందుకు కోప్పడాలనిపించింది.

ఆర్జీవీ తెరకెక్కించిన ఓ వెబ్ సిరీస్ షూట్ కోసం అనంతపురం వెళ్ళాను. అక్కడ షూటింగ్ లో జారి క్రింద పడ్డాను. సర్జరీ జరిగి కొన్నాళ్లు సినిమాలకు దూరమయ్యాను. నా కూతురికి కూడా నటిగా అవకాశాలు వచ్చాయి. హీరోయిన్ గా నటించే ఛాన్స్ లు దక్కాయి. కానీ ఆమెకు ఆసక్తి లేదు. పెళ్లితో నా కూతురు కష్టాలు పాలైంది. భర్త ఆమెను దుబాయ్ తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశాడు. ఆమె డబ్బులు, నగలు అన్నీ లాగేసుకున్నాడు.
ఇంత జరుగుతున్నా నా కూతురు ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు. అనుమానం వచ్చి కూపీ లాగితే ఒక్కో నిజం బయటకు వచ్చింది. మనం తప్పు చేయనప్పుడు తలదించుకోవాల్సిన అవసరం లేదు. భర్తకు విడాకులిచ్చి ఒంటరిగా ఉంటుంది. ఐదేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. ఇప్పుడిప్పుడే ఆమె డిప్రెషన్ నుండి బయటపడుతుందని… సనా చెప్పుకొచ్చింది. సనా దాదాపు 600 చిత్రాల్లో నటించారు. పలు సీరియల్స్ లో నటించారు.