
Illegal Affair: ఆమెకు వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త అనారోగ్యంతో చనిపోవడంతో ఒక వ్యక్తికి దగ్గరైంది. వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడికి భార్య, పిల్లలు ఉన్నారు. దీంతో ఇద్దరూ తమ పిల్లలను స్వగ్రామంలో విడిచిపెట్టి సూదర ప్రాంతం వెళ్లిపోయారు. అక్కడ సహజీవనం చేసేవారు. అడపాదడపా స్వగ్రామాలకు వచ్చి వెళుతుండే వారు. ఇలా తొమ్మిదేళ్లు గుట్టుగా సాగిన వారి వ్యవహారం మహిళ అనారోగ్యంతో మృతిచెందడంతో బయటపడింది. పోలీసుల ఎంట్రీతో మరో ట్విస్టు బయటపడింది.
పశ్చిమబెంగాల్ కు ముక్తా బర్మన్ (35) అనే మహిళకు బోదల్ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 15 సంవత్సరాల కిందట బోదల్ అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో పిల్లలిద్దరితో పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ముక్తా బర్మన్ కు స్వపన్ బర్మన్ (47) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటికే స్వపన్ కు వివాహైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబాలు అడ్డంకిగా మారడంతో ఇద్దరూ కలిసి బెంగళూరు వెళ్లిపోయారు.తాము దంపతులమని నమ్మించి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ముక్తా అపార్ట్ మెంట్ లో స్వీపర్ గాను, స్వపన్ ప్లంబర్ గాను పనిచేసేవారు. లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేసేవారు. అప్పుడప్పుడు పశ్చిమబెంగాల్ వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి వచ్చేవారు.
అయితే వీరి సంసారం హాయిగా సాగుతున్న తరుణంలో ముక్తా బర్మన్ సుగర్ వ్యాధికి గురైంది. వ్యాధితో బాధపడుతూనే పనులుచేసేది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఫిబ్రవరి 7న స్వపన్ ఆమెను ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఫిబ్రవరి 16న వస్తే స్కాన్ చేసి చికిత్స అందిస్తామని అక్కడి వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ముక్తా బర్మన్ కు పరిచయస్థురాలైన పశ్చిమబెంగాల్ కు చెందిన శిబాని ముండల్ భర్తతో కలిసి అదే రోజు పరామర్శకు వచ్చింది. తన ఆరోగ్యం బాగాలేదని.. చనిపోతానని చెప్పి ముక్తా కన్నీరుమున్నీరైంది. నీకు ఏం కాదు చికిత్స చేస్తే నయమవుతుందని చెప్పి శిబాని దైర్యం చెప్పింది. అదే రోజు సాయంత్రం మరోసారి పరామర్శకు వచ్చేసరికి స్వపన్ ఒక్కడే ఉన్నాడు. ఆరోగ్యం విషమించి ముక్తా బర్మన్ చనిపోయిందని.. ఆమె మృతదేహం ప్రైవేటు ఆస్పత్రి మార్చూరీలో ఉందని చెప్పాడు.

ఫిబ్రవరి 9న ఆస్పత్రి మార్చురీలో ముక్తా మృతదేహాన్ని శిభాని ముండల్ పరిశీలించారు. శరరంపై గాయాలు కనిపించాయి. దీంతో ఆమె స్వపన్ ను గట్టిగా ప్రశ్నించింది. పొంతన లేని సమాధానాలు చెబుతుండడమే కాక.. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అదుపులోకి తీసుకోని ప్రశ్నించేసరికి మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం చెప్పాడు. తాము దంపతులం కాదని.. సహజీవనం చేస్తున్నామని చెప్పడంతో శిభానితో పాటు అక్కడున్న వారు షాక్ కు గురయ్యారు. ఆమెకు ఆరోగ్యం క్షీణిస్తోందని.. వైద్యం చేయించలేక నోట్లో గుడ్డలు కుట్టి చంపేశానని స్వపన్ నేరాన్ని అంగీకరించాడు. ప్రియుడి మోజులో పడి అయినవారిని మోసం చేసిన ముక్తా చివరికి అతని చేతిలో హతం కావడం సంచలనం సృష్టించింది.